Today Horoscope: ఆగస్టు 10 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఆగస్టు 10 – మంగళవారం – శ్రావణమాసం

మేషం

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతానం  కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

Today Horoscope
Today Horoscope

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది.

మిధునం

ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలిగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

కర్కాటకం

ఒక వ్యవహారంలో ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

సింహం

బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కన్య

చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది.

తుల

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు

దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం

సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు  లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది   ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

 


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 5th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 19th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Sree matha