NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: ఏప్రిల్ 11 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఏప్రిల్ 11 – మంగళవారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విబేధాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

Today Horoscope
Today Horoscope

వృషభం
ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
మిధునం
నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.
కర్కాటకం
బంధుమిత్రులు మాటలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృధా ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచాలి. ఉద్యోగులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
సింహం
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో మనస్పర్థలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
కన్య
మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.
తుల
దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తివ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్ట పడవలసి రావచ్చు.
వృశ్చికం
సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. దూరప్రాంతం బంధువుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.
ధనస్సు
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.
మకరం
దూర ప్రాంత ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
కుంభం
వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊరట చెందుతారు. ఇంటాబయట సఖ్యతగా వ్యవహరించి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
మీనం
దూరప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమన అదనపు పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

అనంత పద్మనాభస్వామి దేవాలయ విశేషాలు ఇవే !

Sree matha

Dasara special : చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం ఎలా తయారు చేయాలో చుడండి..!

Ram

ఐదోరోజు ఉదయం మోహినీ అవతారం !

Sree matha