NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: ఏప్రిల్ 13 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఏప్రిల్ 13 – గురువారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.

Today Horoscope
Today Horoscope

వృషభం
స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.
మిధునం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి.
కర్కాటకం
ఆకస్మిక ధన లాభం. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.
సింహం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.
కన్య
చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. దైవ విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
తుల
సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
వృశ్చికం
బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి.
ధనస్సు
దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
మకరం
బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కుంభం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మీనం
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

నవగ్రహదోష పరిహారాలకు ఇలా పూజిస్తే అద్భుత ఫలితాలు !

Sree matha

Today Horoscope: మే 12 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Daily Horoscope: మే 24 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma