NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: ఏప్రిల్ 5 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఏప్రిల్  5 – బుధవారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.
మిధునం
మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కర్కాటకం
బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
సింహం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంభంధిత సమస్యలు బాధిస్తాయి.
కన్య
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
తుల
ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.
వృశ్చికం
ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి.
ధనస్సు
వృత్తి,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
మకరం
వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.
కుంభం
బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరా. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.
మీనం
చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంబానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతన విద్యాఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Donald Trump: కోర్టులో లొంగిపోయిన డోనాల్డ్ ట్రంప్ .. కస్టడీలోకి తీసుకున్న న్యూయార్క్ పోలీసులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju