NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: ఏప్రిల్ 6 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఏప్రిల్ 6 – గురువారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Today Horoscope
Today Horoscope

వృషభం
ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
మిధునం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.
కర్కాటకం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
సింహం
నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.
కన్య
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
తుల
రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం
గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మకరం
జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కుంభం
కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.
మీనం
ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

అక్టోబర్ 7 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Akshaya Tritiya: మీ కలలు సాకారం కావాలి అంటే అక్షయ తృతీయ రోజు ఇలా చేయండి..!

bharani jella

Today Horoscope: జనవరి 24 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma