ఆగస్టు 3 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

ఆగస్టు 3 – శ్రావణమాసం – బుధవారం
మేషం
నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.


వృషభం
కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి.
మిధునం
ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం
ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.
కన్య
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి.
తుల
వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
ధనస్సు
మొండి బాకీలు సకాలంలో వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. బంధు మిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
కుంభం
దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
మీనం
ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

56 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago