ఆగస్టు 7 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

ఆగస్టు 7 – శ్రావణమాసం – ఆదివారం
మేషం
మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.


వృషభం
ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిధునం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కర్కాటకం
సతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి.
సింహం
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
కన్య
ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి ఋణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది.
తుల
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసి రావు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
వృశ్చికం
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. పేరుకలిగిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.
మకరం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.
కుంభం
వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు.
మీనం
దూరప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

4 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago