Today Horoscope: ఫిబ్రవరి 4 – మాఘ మాసం – శుక్రవారం
మేషం
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు.
వృషభం
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.
మిధునం
పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది.
సింహం
వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.
తుల
వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.
వృశ్చికం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. పెద్దల ఆరోగ్యసమస్యలు కొంత మానసికంగా కలచివేస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
ధనస్సు
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువుల బహుమతులుగా పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం
వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…