NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ఈరోజు ఆనంద యోగం !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం – మంగళవారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. అప్పుల బాధలు తీరిపోతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు వస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ఈరోజు ఆనంద యోగం !

ఈరోజు ఆనంద యోగం ఉంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. గతంలో మిమ్మల్ని కో ప పడ్డవారు తిరిగి మీ చెంతకు వస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో ధనవృద్ధి పెరుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగస్తుల కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ధన యోగం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది.

today horoscope in telugu april 20
today horoscope in telugu april 20

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండ. అశ్రద్ధ వల్ల ప్రమాదాలు కలుగుతాయి జాగ్రత్త.
రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి ఆంజనేయస్వామికి సింధూరం వేయించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.వ్యాపారులకు అధిక లాభాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధ విషయాలు ఫలిస్తాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. తప్పనిసరి ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. వారి సూచనలను పాటిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. మీ సహాయాన్ని ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చూపుతారు. ఇబ్బందులు కలుగుతాయి. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అనవసరం ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. స్థిరాస్తులు అనుకూలించవు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకం వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ధననష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతిలో డబ్బులు ఉండకపోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.ఆనందంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. బాగుంటారు. స్నేహితులంతా సఖ్యతగా ఆనందంగా ఉంటారు. సోదరులతో స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఆనందంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు.
రెమిడీః ఈ రోజు శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 20 – చైత్రమాసం- మంగళవారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. విద్యార్థుల ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల చికాకు వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju