NewsOrbit
Featured Horoscope

Today Horoscope : మార్చి 10 మాఘమాసం బుధవారం. ఉద్యోగాలలో ప్రోత్సాహం !

Daily horoscope in telugu

Today Horoscope మార్చి 10

మేష రాశి : సమస్యల నుంచి బయటపడతారు !

ఈ రోజు బాగుంటుంది. పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. అన్నిరకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. మీ సొంతంగా మీరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంతా బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : బంధువులతో విభేదాలు !

ఈ రోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. తొందరపాటు తనం వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు.
రెమిడీః ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి.

మిధున రాశి : ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యత గా ఉంటారు. మీ కోసం కంటే ఇతరుల కోసం బాగా కష్ట పడతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపార భాగస్వాముల వల్ల నష్టాలు కలుగుతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. తొందరపడి అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు అనుకూలించవు. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలు వెళ్లిపోతాయి.
రెమిడీః ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి.

సింహరాశి : వ్యాపారాలో అధిక లాభాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి : ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల ఇబ్బందులు. పెద్ద వారి సూచనలను పాటించడం మంచిది. ఓర్పు సహనం లోపించడం వల్ల నష్టపోతారు. చేపట్టిన పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు.
రెమిడీః ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

తులారాశి : రుణబాధలు తగ్గిపోతాయి !

 

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు గతంలో ఉన్న నిర్లక్ష్యాన్ని వదిలి చదువు మీద శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి.
రెమిడీః షట్పదీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : అనారోగ్య సమస్యలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీకంటే చిన్నవారితో గొడవ పడడం వల్ల నష్టపోతారు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బంది కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువును నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : శ్రమకు తగ్గ ఫలితం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం అనుకూలిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు పుట్టింటి నుంచి శుభవార్తలు వస్తాయి.
రెమిడీః ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

మకర రాశి : మిత్రులు శత్రువులు అవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడక పోవడం వల్ల సమస్యలు. చంచల స్వభావం కలిగి ఉంటారు. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేసుకోండి.

కుంభరాశి : దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ధర్మానికి, న్యాయానికి ప్రాధాన్యతనిస్తారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. సమయానికి నిద్ర ఆహారం తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు.నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : ఆర్ధిక నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. ఇతరులు చెప్పిన మాటలు నమ్మడం వల్ల మోసపోతారు. పెట్టుబడులు అనుకూలించవు. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఆర్ధిక నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సహాయం చేసేవారు దూరమవుతారు. అనుకున్న పనులను వాయిదా వేయడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju