NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ఈరోజు బాగుంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 13 – మాఘమాసం – శనివారం.

మేషరాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కోపం వల్ల, తొందరపాటుతనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు, అప్పుల బాధలు పెరుగుతాయి, ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తుల కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఎదుటివారు సమయానికి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. మీ మీద నింద పడుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తికాక వాయిదా పడతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ఈరోజు బాగుంటుంది !

ఈ రోజు బాగుంటుంది. మొండి పట్టుదలతో అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందుతారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల ఓర్పు లేకుండా వల్ల నష్టం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ముఖ్యమైన విషయాల్లో మీ అంతట మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకుండా వల్ల నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు, ధర్మానికి పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఎదుటి వారికి సహాయం చేయాలని స్వభావాన్ని కలిగి ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. పిల్లల వల్ల శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈ రోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణ చేసుకోండి.

today horoscope in telugu march 13 2021
today horoscope in telugu march 13 2021

సింహరాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీలో ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులకు అందరికీ సఖ్యతగా ఆనందంగా ఉంటారు. గృహోపకరణా వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శుభవార్తలు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించండి.

 కన్యారాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. ధన యోగం కలుగుతుంది. స్నేహితులతో అయిన వారితో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. తల్లిదండ్రుల ఆస్తులు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అవుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీలో ఉన్న కోపం వల్ల మీ ప్రాణ స్నేహితులు దూరమవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకొని ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించుకోండి.

వృశ్చికరాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి అనుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని భారం తగ్గించుకొని ఆనందంగా ఉంటారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. అవివాహితులకు వివాహ వకాశాలు అనుకూలిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు.
రెమిడీః ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్ద వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీదుర్గా దేవిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. చేపట్టిన పనులను కష్టపడి సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువును అశ్రద్ధ చేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో అధిక శ్రమ ఏర్పడుతుంది. ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope మార్చి-13 – మాఘమాసం – శనివారం.సంతోషకరంగా ఉంటుంది !

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సునాయాసంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో మార్కులు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యత గా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju