NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ఆకస్మిక ధన లాభం !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 19 – ఫాల్గుణ మాసం – శుక్రవారం.

మేష రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల మీకు సహాయం చేసే వారు దూరం అవుతారు. క్రొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. తొందరపడి కొత్తవారిని నమ్మడం వల్ల మోసపోతారు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. ఎలాంటి కష్టమైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి కొన్ని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. పని భారాన్ని తగ్గించుకుంటారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. ధననష్టం జరుగుతుంది. ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో ధననష్టం కలుగుతుంది.
రెమిడీః భగవద్గీత పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ఆకస్మిక ధన లాభం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్ద వారి సలహాలను, సూచనలను పాటిస్తారు. ఇతరులకు సలహాలను ఇస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
రెమిడీః లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 19 2021
today horoscope in telugu march 19 2021

 సింహరాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.బంధువులతో విభేదాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిది. ధన నష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. కార్యాలయాల్లో చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు అనవసరమైన విషయాల మీద పెద్ద చూపి చదువు విషయంలో అశ్రద్ధగా ఉంటారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీః దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎదుటి వారికి దానధర్మాలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. అనేక రకాల సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.వ్యాపారాల్లో ఆటంకాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఆచార సాంప్రదాయాలకు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల నష్టపోతారు. కార్యాలయాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయాయి. విద్యార్థులు సమయాన్ని వృధా చేసి చదువు విషయంలో నిర్లక్ష్యం చూపుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
రెమిడీః గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.సంతోషంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. ఎదుటివారికి ధర్మాన్ని, మంచి విషయాలను బోధిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
రెమిడీః విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.సమస్యలు అధికమవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారు మీద నిందారోపణలు చేస్తారు. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం కలుగుతుంది. స్థిరాస్తులు అనుకూలించవు. కుటుంబ సమస్యలు అధికమవుతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువున్ని అశ్రద్ధ చేస్తారు. పిల్లల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ఆర్థిక లాభం !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. రుణబాధలు తగ్గిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక లాభం కలుగుతుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధన లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి .

కుంభరాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ఖర్చులు అధికమవుతాయి !

ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తికాక వాయిదా పడతాయి. మీరు చేయని తప్పులకు మీ మీద నిందలు పడతాయి. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. తొందరగా డబ్బు సంపాదించాలని తప్పులు చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయంలో అధిక శ్రమ ఏర్పడుతుంది. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-19 – పాల్గుణ మాసం – శుక్రవారం.ఉన్నత వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ప్రాణ స్నేహితులను కలుసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఎదుటి వారికి సాయం చేయాలనే గొప్ప భావన కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విహార యాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju