Today Horoscope: జనవరి 15 – పుష్యమాసం – రోజు వారి రాశిఫలాలు

Today Horoscope jan 17th
Share

Today Horoscope: జనవరి 15 – పుష్యమాసం – శనివారం

మేషం

వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

Today Horoscope jan 15th
Today Horoscope jan 15th

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.వ్యాపారమున అవరోధాలు తప్పవు.
మిధునం
కుటుంబసభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం
ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు. బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.
సింహం
ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.
కన్య
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తవుతాయి ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విద్య విషయాలలో మరింత కష్ట పడవలసి వస్తుంది.
తుల
ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.స్థిరస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది.
ధనస్సు
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
మకరం
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.
కుంభం
శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.
మీనం
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రం వెనక్కు తగ్గిందా..? పవన్ కళ్యాణ్ అల్టిమేటమ్ ఏమైంది..??

somaraju sharma

మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగడానికి ఇలా చేయండి !

Sree matha

Growth : మీ వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాలలో మళ్ళీ   అభివృద్ధి  తగ్గడానికి కారణం ఇదే కావచ్చు…  వెంటనే పరిష్కరించుకోండి!!

siddhu