జూలై 11 – ఆషాడ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

జూలై 11 – ఆషాడమాసం – సోమవారం
మేషం
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


వృషభం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి.
మిధునం
వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు.
కర్కాటకం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సంతాన విద్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
సింహం
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కన్య
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.
తుల
ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. బందుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు
దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.
మకరం
వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం
అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మీనం
వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి విశేష స్పందన .. వందల సంఖ్యలో అర్జీలు


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

15 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

39 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago