Today Horoscope: జూలై 2 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: జూలై 2 – ఆషాడమాసం – శనివారం
మేషం
ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి.

Today Horoscope July 2

వృషభం
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా సమస్యలను అధిగమిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
మిధునం
నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కర్కాటకం
ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం
అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
కన్య
ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
తుల
నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగపరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.
ధనస్సు
ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారస్తుల కష్టానికి తగిన ఫలితం లభించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది.
మకరం
జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కుంభం
వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.
మీనం
ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

5 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

57 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago