జూలై 22 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

జూలై 22 – ఆషాఢమాసం – శుక్రవారం
మేషం
గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.


వృషభం
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి.
మిధునం
రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నూతన వాహనం యోగం ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.
కర్కాటకం
నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కన్య
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఇంటా బయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల
కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది.
ధనస్సు
వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.
మకరం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.
కుంభం
ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
మీనం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

27 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

36 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago