జూలై 29 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

జూలై 29 – శ్రావణ మాసం – శుక్రవారం
మేషం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.


వృషభం
వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.
మిధునం
ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.
సింహం
వ్యాపారాలలో నూతన సమస్యలు జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
కన్య
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్ధిక లాభం కలుగుతుంది. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
తుల
వృత్తి ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలను చెయ్యడం మంచిది. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ధనస్సు
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
మకరం
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం
వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
మీనం
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తవహించాలి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

56 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago