Today Horoscope: జూన్ 8 – జ్యేష్ఠమాసం – బుధవారం
మేషం
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.
వృషభం
వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.
మిధునం
కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు.
కర్కాటకం
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
సింహం
ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
కన్య
ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.
తుల
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి.
ధనస్సు
కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలసిరావు.
మకరం
వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.
కుంభం
సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీనం
ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…