Today Horoscope July 3ed
Today Horoscope: జూన్ 24 – జేష్ఠమాసం – శుక్రవారం
మేషం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి.
వృషభం
ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిధునం
నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాతరుణాలు తీర్చగలుగుతారు.
కర్కాటకం
తన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
సింహం
ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలను అందుకుంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు.
తుల
గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. జీవిత భాగస్వామ్య సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి.
ధనస్సు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు రాజి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల ప్రశంసలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు.
మకరం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభం
చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి.
మీనం
చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. పాత మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…