Today Horoscope: జూన్ 27 – జేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: జూన్ 27 – జేష్ఠమాసం – సోమవారం

మేషం
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ దర్శనాలు మానసికఒత్తిడిని తగ్గిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికం అవుతుంది. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.

Today Horoscope June 27th

వృషభం
నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు.
మిధునం
వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
కర్కాటకం
కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూరప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.
సింహం
వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు.
కన్య
ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. ద్వి స్వభావ ఆలోచనలు ఉంటాయి.
తుల
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విభేదించినవారే దగ్గరవుతారు.
ధనస్సు
అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యలనుండి చాకచక్యంగా బయట పడతారు వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది.

మకరం
కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మిత్రులనుండి సమస్యలు కలుగుతాయి శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. దైవ భక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది.
కుంభం
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు ఆరోగ్యం అంతగా అనుకూలించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిరావచ్చు.
మీనం
ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

54 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

58 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago