Today Horoscope: మే 21 – వైశాఖమాసం – శనివారం
మేషం
సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం
ఆర్థికవ్యవహారాలలో లోటుపాట్లుఉంటాయి. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో శిరోభాదాలు తప్పవు వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలొ కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మిధునం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి, నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశములు అందుకుంటారు.
కర్కాటకం
నిరుద్యోగ అవకాశములు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు.
సింహం
సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం. కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనయోగం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య
ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది.
తుల
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.
ధనస్సు
నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది.
మకరం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీత భత్యముల విషయంలో శుభవార్తలు వింటారు.
కుంభం
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ధన పరంగా ఇబ్బంది కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
మీనం
ఆర్ధికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది.పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సహకరంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…