Subscribe for notification
Categories: Horoscopeదైవం

Today Horoscope: మే 23 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 23-వైశాఖ మాసం – సోమవారం
మేషం

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

Today Horoscope may 23ed

వృషభం

చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.

మిధునం

సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆలయ సందర్శన చేసుకొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటకం

ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు.

కన్య

ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధనసహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

తుల

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. గృహమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

వృశ్చికం

బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

ధనస్సు

వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.

మకరం

ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి.

కుంభం

నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

మీనం

ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి.ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Read more:YCP MLA: ఆ ప్రభుత్వ పథకంపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్


Share
somaraju sharma

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

28 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

28 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

40 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago