Categories: Horoscopeదైవం

Today Horoscope: మే 27 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope:మే 27 – వైశాఖ మాసం – శుక్రవారం

మేషం

ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన వస్తు వాహనాలు చేస్తారు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

Today Horoscope May 27th

వృషభం

బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

మిధునం

చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

కర్కాటకం

నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగమున మీ పని తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం

బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరుల నుండి ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచన లో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

తుల

స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు

కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు నిరాశ కలుగుతుంది ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.

మీనం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో……


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

21 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago