Subscribe for notification
Categories: Horoscopeదైవం

Today Horoscope: మే 30 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 30 – వైశాఖ మాసం – సోమవారం
మేషం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

Today Horoscope may 30th

వృషభం

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.

మిధునం

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం

బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

సింహం

నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల

మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం

ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలొ సానుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

మకరం

ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.

కుంభం

చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

మీనం

ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

 

Read more: Amalapuram: అమలాపురం ప్రాంత ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన .. ఎందుకంటే..?

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share
somaraju sharma

Recent Posts

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

2 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago