NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.అప్పుల బాధలు తొలగిపోతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, బుధవారం, తిథి: షష్ఠి రాత్రి 9.59 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: విశాఖ రాత్రి 11.57 వరకు, వర్జ్యం: ఉదయం 6.49 నుండి ఉదయం 8.18 వరకు, పునర్‌ వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 3.44 నుండి 5.15 వరకు, అమృత ఘడియలు: పగలు 3.46 నుండి సాయంత్రం 5.15 వరకు, రాహుకాలం: పగలు 1.57 నుండి 3.26 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 10.29 నుండి 11.17 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 3.14 నుండి 4.01 వరకు. మార్చి 4 – మాఘ మాసం – బుధవారం.

మేషరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.అప్పుల బాధలు తొలగిపోతాయి !

ఈ రోజు బాగుంటుంది. తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. సంతోషంగా జీవించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఆచార సాంప్రదాయాలకు, పరువు ప్రతిష్టలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారు చెప్పిన మాటలను సూచనలను పాటిస్తారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధనయోగం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో మీ అంతట మీరే గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ  మీరు ఆకర్షిస్తారు. ఏ సమస్యనైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించుకొని లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృషభరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలు కాకపోవడం వల్ల ఆర్ధికంగా నష్టాలు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటుతనం వల్ల మిత్రులు కూడా శత్రువులు అవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. పిల్లల కోసం ఖర్చు ఎక్కువ చేస్తారు. ప్రయాణాలు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాల మీద శ్రద్ధ చూపి, చదువు విషయం నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కోసం కంటే ఎదుటివారి కోసం కష్టపడతారు. పక్కవారికి సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో అందరితో, సఖ్యతగా ఆనందంగా ఉంటారు. గొడవలకు వాదోపవాదాలకు దూరంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు నీతినిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కొత్త పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. మొక్కల మీద ఆసక్తి చూపుతారు. ప్రకృతిని ఇష్టపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.

రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.బంధువులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల చికాకు వల్ల అయినవారిని దూరం చేసుకుంటారు. బంధువులతో విభేదాలు కలుగుతాయి. శత్రుబాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు, ధన నష్టం జరుగుతుంది. ఆచార వ్యవహారాలను, పద్ధతులను నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల గౌరవమర్యాదలు తగ్గిపోతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా చదువు విషయాన్ని అశ్రద్ధ చేస్తారు. స్త్రీలకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు కలుగుతాయి. స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

today march 4 daily horoscope in telugu
today march 4 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. అందరికీ సహాయపడాలనే మనస్సును కలిగి ఉంటారు. భౌతికపరమైన ఆనందానికి ప్రాధాన్యతనిస్తారు. మీలో ఉన్న తెలివితేటలు వల్ల సమయస్ఫూర్తితో ఇతరులతో అవసరమైన సమయంలో పనులు చేయించుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. విద్యార్థుల బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.అనవసర ఖర్చులు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఆర్ధిక నష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న కోపం వల్ల చికాకు వల్ల తొందరపాటుతనం వల్ల మీకు సహాయం చేసే వారు దూరమవుతారు. మీలో ఉన్న కోపం వల్ల వ్యాపార భాగస్వాముల దూరమవుతారు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు మంచి మాటలతో మిమ్మల్ని మోసం చేస్తారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధిక పనిభారం, ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు చదువు మీద  శ్రద్ధ కోల్పోయి వాయిదా వేస్తారు.
రెమిడీః ఈ రోజు దేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు వరకు నెమ్మదిగా సాగిన పనులను తిరిగి ఇప్పుడు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ మీరు ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. కుటుంబ సభ్యులతో సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల కోపం వల్ల స్నేహితులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులను చేస్తారు. ధననష్టం జరుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీరంటే ఇష్టపడే వారిని అపార్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపారాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల పట్ల మాటపట్టింపులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. క్రమశిక్షణకు పట్టుదలకు నిజాయితీకి ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణబాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.సమస్యలు ఎదురవుతాయి !

ఈ రోజు మీకు సంతోషకరంగా ఉండదు. మీ మాట తీరు వల్ల అందరితో విభేదాలు కలుగుతాయి. అనుకున్న పనులను మీలో ఉన్న బద్ధకం వల్ల వాయిదా వేస్తారు. సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్ధిక నష్టం జరుగుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాల మీద శ్రద్ధ చూపించే చదువును నిర్లక్ష్యం చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు సమస్యలకు దారి తీస్తాయి.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించాలి.

కుంభరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారూ. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. అందరితో పొగడ్తలు కావాలని ఆశ పడతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope మార్చి- 4 – మాఘమాసం – గురువారం.ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు పట్ల అశ్రద్ధ చూపుతారు. తొందరపడి మాట జారడం వల్ల విభేదాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల చికాకు, వల్ల అనర్ధాలు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju