Breaking: అగ్రరాజ్యం అమెరికాలో ఒక్క సారిగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దేశ వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయినట్లు అక్కడి మీడియా తెలిపింది,.

యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వ్యవస్థ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయని వెల్లడించింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విమాన సర్వీసులను పునరుద్దరించేందుకు నిపుణులు పని చేస్తున్నట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది.