ట్రెండింగ్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

ఇక‌పై ట్రంప్ జీవించేది అక్కడే..?

Share

అమెరికా నూత‌న అధ్యక్షుడిగా ఈరోజు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మాజీ అధ్య‌క్షుడు కానున్న ట్రంప్ పై ప‌లు ప్ర‌శ్న‌లు ఇప్ప‌టికే చాలా మంది లేవ‌నెత్తుతున్నారు. అందులో ట్రంప్ ఇక‌నుంచి ఎక్క‌డ ఉండ‌బోతున్నార‌నేది. దీనిపై ఇప్ప‌టికి చాలా పెద్ద చ‌ర్ఛ జ‌రుగుతోంది. దీనిపై అమెరికా మీడియా ప‌లు క‌థ‌నాల‌ను విడుద‌ల చేస్తోంది. దాని ప్ర‌కారం.. ట్రంప్ ఇక‌ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు షిఫ్ట్ అవ్వనున్నట్టు స‌మాచారం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ సమీపంలో ట్రంప్‌కు చెందిన పెద్ద‌ మారాలాగో ఎస్టేట్‌లో ఆయ‌న ఉండ‌బోతున్న‌ట్లు ఒక అమెరికా మీడియా తెలిపింది.

ఈ వార్త‌ను నిజం చేస్తూ.. ఆ ఎస్టేట్ లో అనేక ట్రక్‌లు తిరుగుతున్నాయి. దీంతో మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ ఉండబోయేది ఆ ప్రాతంలోనే అని తెలుస్తోందని అమెరికా మీడియా చెబుతోంది. నూత‌న అధ్య‌క్షుడైన‌ జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయ‌న అక్క‌డ‌కు చేరుకుంటార‌ని తెలుస్తోంది. అయితే ట్రంప్ మెద‌టినుంచి న్యూయార్క్ లోనే ఉంటున్నారు. 2019లో ట్రంప్ తన ఇంటి అడ్రస్‌ను న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

శీతాకాలంలో ఆయ‌న‌ ఫ్లోరిడాలోని మారాలాగో ఎస్టేట్‌లోనే ఉంటారు. దీంతో ఎంతో మంది మంది ఈ ఎస్టేట్‌ను వింటర్ వైట్‌హౌస్ అని కూడా అంటుంటారు. ఇక్క‌డున్న‌ ఎస్టేట్‌ను ఆయ‌న‌ 1985లో కొనుగోలుఉ చేశాడు. దీనికి 10 మిలియన్ డాలర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ ఎస్టేట్ లోకి వెళ్లాలంటే క్ల‌బ్ మెంబ‌ర్ షిప్ త‌ప్ప‌క ఉండాల్సిందే. ఈ ఎస్టేట్ 20 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.దీన్ని 1927లో నిర్మించారు. ఈ ఎస్టేట్ లో మొత్తం 128 గదులు ఉంటాయి. ఈ ఎస్టేట్ నుంచి అట్లాంటిక్ సముద్ర అందాలను చూడొచ్చు.


Share

Related posts

AP CM YS Jagan: జగన్ బెయిల్ రద్దుపై సర్వత్రా ఉత్కంఠ..! నేడే సీబీఐ కోర్టు తీర్పు..!!

somaraju sharma

పిసిసి చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా

somaraju sharma

విగ్రహాల రాజకీయం ముదిరితే ఏమౌతుంది..??

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar