పాకిస్థానీ హల్క్.. ఏకంగా 435 కిలోల బరువు..! సాధారణంగా మనం కొంతమందిని ఎంతో ఎత్తు,

Share

లావుగా ఉండడం చూసి అమ్మో అంటాం.. అలాంటి వారిని మించి ఎత్తు, లావు ఉండి అతను చేసే సాహసాలు చూస్తే ఆశ్చర్యపోతారు. అందరూ అతనిని పాకిస్థానీ హల్క్ అని పిలుస్తారు. అతని అసలు పేరు అర్బాబ్ ఖిజేర్ హయత్ అయితే అంతా ఖాన్ బాబా అని పిలుస్తారు. ఇతను ఏకంగా 435 కిలోల బరువు ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంత బరువున్న ఖాన్ ప్రతి రోజు ఏకంగా పది వేల కేలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. ఇంత బలంగా ఉన్న ఖాన్ తలచుకుంటే కార్లు, బైకులు ఎత్త గలడు, ఒంటిచేత్తో ట్రాక్టర్లను ఆపగలడు.

ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌లోని మాద్రాన్ జిల్లాలో నివసిస్తున్న అర్బాబ్ ఖిజేర్ హయత్
ఎంతో పాపులర్ అయ్యారు. ఇతర ఆహార విషయానికి వస్తే ప్రతి రోజు ఉదయం కోడిగుడ్లు, మూడు కిలోల మాంసం, ఐదు లీటర్ల పాలు తాగుతాడు… అంటే ఒక సాధారణ వ్యక్తి నెల రోజుల పాటు తీసుకొనే ఆహారం ఖాన్ ఒక్క రోజు తీసుకోవడం ఎంతో ఆశ్చర్యం. ఇంత ఎత్తు, బలంగా ఉన్న ఖాన్ వయసు కేవలం 28 సంవత్సరాలు. ఇంత బరువున్న ఖాన్ పెళ్లి చేసుకోవాలని భావిస్తుండటంతో అతనికి పిల్ల దొరకడం ఎంతో కష్టంగా మారింది.

తన పెళ్లి విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖాన్ ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూ కడుతున్నప్పటికీ, ఖాన్ మాత్రం దాదాపు 300 మంది అమ్మాయిలను రిజెక్ట్ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అలా చేయడానికి గల కారణం ఏమిటంటే తను ఎంతో ఎత్తు, బరువు ఉండటం వల్ల అమ్మాయిలు కూడా 100 కిలోల బరువు ఉన్న వారిని చేసుకోవాలని భావించటం వల్ల ఇప్పటివరకు ఇతనికి పిల్ల దొరకలేదు. ఇక పెళ్లి విషయం పక్కన పెడితే ఖాన్ కి WWE ఛాంపియన్ కావాలని ఉందట. అందుకోసం తను బరువు తగ్గటానికి ఇష్టపడకుండా, తన బరువును పెంచుకుంటున్నాడు. అలాగే బరువు పెరిగే క్రమంలో అతని శరీరం ఫిట్ నెస్ పై కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖాన్ సాహసాలకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

17 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

18 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago