Papua New Guinea: పావువా న్యూ గినియో దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా – పసిపిక్ ఐలాండ్స్ కోఆపరేష్ (ఎఐపీఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆ దేశం వెళ్లారు. పపువా న్యూగినియా చేరుకున్న ప్రధాని మోడీకి ఈ దేశంలో ఘన స్వాగతం లభించింది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని జేమ్స్ మరాపే .. ఆయన కాళ్లకు మొక్కి మరీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మొదట ఇరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోడీకి పాదాభివందనం చేశారు న్యూ గినియో దేశ ప్రధాని. వాస్తవానికి సూర్యాస్తమయం తరువాత ఆ దేశంలో ప్రవేశించే ఇతర దేశాల నేతలకు సాధారణ ఉత్సవంగా స్వాగతం పలకరు.

కానీ ఆదివారం సాయంత్రం మోడీ విషయంలో ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి మరీ ఘనంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని మోడీకి ప్రత్యేక మినహాయింపును ఇచ్చారు. పపువా న్యూ గినియాను ఒక భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలి సారి. గతంలో భారత ప్రధానులు ఎవరూ ఆ దేశాన్ని సందర్శించలేదు. ఈ దేశాన్ని ఆయన చేరగానే అక్కడి భారతీయులు కూడా ఆయనను సాదరంగా స్వాగతించారు. ప్రధాని జేమ్స్ మరాపేతో కలిసి సోమవారం జరిగే ‘ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్’ మూడవ సమ్మిట్ లో మోడీ పాల్గొంటారు.
ఈ రోజు వరకూ జపాన్ లోని హిరోషిమాలో జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ .. అది ముగించుకున్న అనంతరం ఇక్కడికి చేరుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోడీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. సమ్మిట్ లో పాల్గొనేందుకు 14 పసిఫిక్ ఐలాండ్ దేశాలూ అంగీకరించడం పట్ల మేడీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదివారం ఉదయం ప్రకటన చేశారు. దీన్ని ఆయన అతి ముఖ్యమైన సమావేశంగా పేర్కొన్నారు.
మోడీ 2014 లో ఫిజీ పర్యటన సందర్భంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పసిఫిక్ దీవుల సహకారంలో కుక్ దీవులు, పిజి కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పావువా న్యూ గినియో, నమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు, వనాటు ఉన్నాయి. ప్రధాని మరాపేతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక.. గవర్నర్ బాబ్ దడాయేతోనూ భేటీ కానున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం