NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ ప్ర‌పంచం

Russia Ukraine: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా..!? రష్యా – ఉక్రెయిన్ గొడవ ఎక్కడికి..!?

Russia Ukraine: ప్రపంచ వ్యాప్తంగా నేడు బర్నింగ్ టాపిక్ గా ఉన్నది ఏమైదా ఉంది అంటే ఉక్రెయిన్ పై రష్యా దాడి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ నేపథ్యంలో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా..? అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుండి ఉక్రెయిన్ పై వరుసగా రష్యా క్షిపణులతో దాడి చేస్తోంది. ఈ దాడులు ప్రారంభం అయిన తరువాత ఉక్రెయిన్ రాజధాని కకావికలమైంది. ఉక్రెయిన్ రాజధానిలోని ఎయిర్ పోర్టు రష్యా సైనిక బలగాల ఆధీనంలోకి వచ్చేసింది. ఉక్రెయిన్ కూడా రష్యా క్షిపణుల మీద, రష్యా సైనిక బలగాల మీద ఎదురుదాడి మొదలు పెట్టింది. ఉక్రెయిన్ కు ఫ్యాన్స్ సైనిక బలం ఇవ్వలేదు కానీ ఆర్ధిక సహకారం అందిస్తామని ప్రకటించింది. అమెరికా మాత్రం ఉక్రెయిన్ కు సైనిక బలగాలను పంపిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు సైనిక  బలగాలను నెమ్మదిగా పంపుతోంది. బ్రిటన్ కూడా ఉక్రెయిన్ కు సైనిక బలగాలను తోడుగా పంపుతోంది. రష్యా మీద దాడి చేయడానికి ఉక్రెయిన్ బలం సరిపోదు. రష్యాకు సుమారు 4 లక్షల సైనికబలం ఉంటే ఉక్రెయిన్ కు మొత్తం కలిపి లక్షన్నర వరకు మాత్రమే ఉంటుంది. అమెరికా, బ్రిటన్ బలగాలు తోడైతే రష్యాకు సమానంగా బలగాలు తోడవుతాయి. కానీ ఇవి ఉన్నా సరే రష్యాకు యుద్ద విమానాలు, యుద్ద నౌకలు, అణ్యాయుధాలు రష్యాకు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ కూడా తమ వద్ద ఉన్న యుద్ధ విమానాలు, యుద్ద నౌకలు ఉక్రెయిన్ కు సహకారంగా రష్యా మీదకు దాడికి వెళితే అది ఉక్రెయిన్ కు రష్యా మధ్య యుద్ధం కాదు. అమెరికా – రష్యా మధ్య యుద్ధం అవుతుంది. బ్రిటన్, అమెరికా కలిసి రష్యా మీద యుద్ధానికి వెళ్లినట్లు అవుతుంది. అప్పుడు రష్యాకు మిత్ర దేశమైన చైనా, ఉత్తర కొరియా రంగంలోకి దిగుతాయి.

Read More: Ukraine War: యుద్ధం మొదలైంది..ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చిరిక..

Russia Ukraine: నాలుగు సంపన్న దేశాలు తలబడితే..?

ప్రపంచంలో బాగా సంపన్న దేశాలుగా అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. ఈ నాలుగు దేశాలు యుద్ధానికి తలబడితే ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లే లెక్క. అప్పుడు ఇండియా లాంటి దేశాలు తాము తటస్థంగా ఉంటాము, యుద్ధంలో జోక్యం చేసుకోము, గోడమీద పిల్లిలా ఉంటాము అంటే కుదరదు. ఏదో ఒక కూటమి వైపు మద్దతు పలకాలి. ఏదో ఒక రకంగా సహకారం అందించాలి. ఐక్యరాజ్యసమితి ఏమైనా కంట్రోల్ చేస్తుందా అంటే అదీ కుదరదు. ఐక్యరాజ్యసమితి మాట కూడా వినే స్టేజిలో రష్యా, చైనా, అమెరికా దేశాలు లేవు. ఈ దేశాలు ఐక్యరాజ్యసమితి మాట కూడా వినరు. యుద్ధం ఎప్పుడూ ఏటాక్ మోడ్ లో జరుగుతుంది. డిఫెన్స్ మోడ్ (స్వీయరక్షణ) లోనూ జరుగుతుంది. ఉక్రెయిన్ ను కాపాడటానికి అమెరికా, బ్రిటన్ పరిమితం అయితే ఇబ్బంది లేదు. కానీ ఉక్రెయిన్ ను కాపాడటానికి రష్యా మీద దాడి చేసి రష్యా యుద్ద విమానాలను, క్షిపణులను నేలకూలిస్తే అప్పుడు రష్యాకి ఇతర దేశాలకు యుద్ధం జరుగుతుంది.

Russia Ukraine: 1991 నుండి ఉక్రెయిన్ తో గొడవ

ఈ పరిణామంతో రష్యాకు తోడుగా ఇతర పెద్ద దేశాలు రంగంలోకి దిగుతాయి. అప్పుడు ప్రపంచ యుద్ధం కఛ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఏ ఒక్కరూ ఆపలేరు. ఓ చిన్న భూభాగం కోసం. ఎప్పుడో 1991 నుండి రష్యాకి ఉక్రెయిన్ మధ్య గొడవ ఉంది. 2014 నాటికి ఈ గొడవ సద్దుమణిగింది అనుకున్నారు. ఉక్రెయిన్ జనాభాలో 22 శాతం రష్యన్ భాష మాట్లాడతారు. రష్యన్ కల్చర్ అలవాటుపడి ఉంటారు. మిగిలిన వాళ్లు అందరూ ఉక్రెయిన్ దేశస్తులుగా సంస్కృతి సాంప్రదాయాలతో ఉంటారు. 2014లో ఉక్రెయిన్ అధ్యక్షుడుగా ఉన్న నేత రష్యాకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నాడు అన్నఆరోపణ ఉండేది. అప్పటి నుండి రష్యాకు ఉక్రెయిన్ కు గ్యాప్ ఏర్పడింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. దీనికి కొంత సమయం పట్టవచ్చు.

 భారత్ పై ప్రభావం

రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో భారత్ పై ఆ ప్రభావం పడుతుందా..? లేదా అని పరిశీలిస్తే కఛ్చితంగా పడుతుందనే మాట వినబడుతోంది. ఎందుకంటే ఆయుధాల కోసం భారత్ ఎక్కువగా రష్యాపై ఆధారపడుతోంది. తాజా యుద్ధంతో ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు రద్దు చేసుకోవాలని అమెరికా భారత్ పై ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్నాయి. రష్యా నుండి చమురు దిగుమతి తగ్గి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. రష్యా, ఉక్రెయిన్ నుండి గోధుమల దిగుమతి ఇండియాకు తగ్గుతుంది. భారత దేశంలో బీరు తయారీకి వాడే బార్లీ గింజలు ఉక్రెయిన్ నుండి దిగుమతి తగ్గి బీర్ కంపెనీలకు భారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా సన్ ప్లవర్ ఉక్రెయిన్ నుండి దిగుమతి తగ్గడం వల్ల నూనె ధరలు పెరుగుతాయి.  అదే విధంగా ప్రపంచ యుద్ధం వస్తే భారతదేశానికి ప్రాణనష్టం అయితే ఉండదు కానీ ఆర్ధిక నష్టం జరుగుతుంది.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju