NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine Russia War: రష్యా – ఉక్రెయిన్ పోరులో కీలక పరిణామం .. ఇది నిజంగా ప్రపంచం ఊపిరిపీల్చుకునే వార్తే..

Ukraine Russia War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా భీకరపోరు సాగిస్తుండగా ఉక్రెయిన్ కూడా తగ్గేదే లే అన్నట్లు దాడులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధానికి స్వస్తి పలికేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించారు. బెలారస్ లో జరిగే చర్చలకు తాము వస్తామని ప్రకటించడంతో శాంతి చర్చలు ప్రారంభం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ రష్యా చర్చలకు పిలిచినా ఉక్రెయిన్ అంగీకరించలేదు.

Ukraine Russia War: ukraine willing to talks
Ukraine Russia War ukraine willing to talks

Ukraine Russia War: శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకారం

ఆయుధాలు వీడి చర్చలకు రావాలన్న రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ పలు మార్లు తోసిపుచ్చింది. రష్యా పెట్టిన కొన్ని షరతులకు కూడా ఉక్రెయిన్ అంగీకరించింది. చర్చల కోసం ఇప్పటికే ఉక్రెయిన్ అధికారుల బృందం బెలారస్ బయలుదేరి వెళ్లింది. ప్రపంచ దేశాలన్నీ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్న తరుణంలో చర్చలకు మార్గం సుగమం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలు ఫలప్రదం అయి యుద్ధం ముగిస్తే ఉక్రెయిన్ ప్రజలే కాదు ప్రపంచ దేశాలు కూడా ఊపిరిపీల్చుకుంటాయి.

Ukraine Russia War: అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉక్రెయిన్

అంతకు ముందు రష్యా సైనిక చర్యపై ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐ సీ జే) ఆశ్రయించింది. మిలటరీ ఆపరేషన్ ను నిలిపివేయలని రష్యాను ఆదేశించాలని కోరుతూ ధరఖాస్తు సమర్పించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెెన్ స్కీ తెలిపారు. వచ్చే వారం నుండి విచారణ ప్రారంభమవుతుందని ఆశిస్తునట్లు చెప్పారు,. జరుగుతున్న మారణహోమానికి రష్యాను బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju