NewsOrbit
ప్ర‌పంచం

What is Agent Orange: ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏంటి? అందులో ఏముంటుంది? యుద్ధ చరిత్ర లో దీనిని ఎలా వాడారు? దీనివల్ల వియత్నామీస్ పడుతున్న కష్టాలు!

What is Agent Orange: ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలలో వియత్నాం అమెరికా మధ్య జరిగినది చరిత్రలో ఎన్నడు మర్చిపోలేనిది. అప్పటికే జపాన్ దేశంపై అణు బాంబ్ తో వీరుచుకుపడిన అమెరికా ప్రపంచ ఆధిపత్య పోరు కోసం.. తహతహలాడి వియత్నాంతో యుద్ధానికి దిగి ప్రపంచానికి విలన్ గా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరో ప్రపంచ యుద్ధానికి బీజం పడుతుందేమో అన్న భయం కలిగించిన యుద్ధం “వియత్నాం వార్”. అగ్రరాజ్యం అమెరికాని ఈ యుద్ధంలో.. అతి చిన్న దేశమైన వియత్నాం పరుగులు పెట్టించింది. ఆధిపత్య పోరు కోసం రష్యా అమెరికా పరోక్షంగా పోరాడిన యుద్ధం.

What is Agent Orange..whats in it..and suffering of the Vietnamese details
Agent Orange

అయితే యుద్ధానికి గల కారణాలు చూస్తే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వియత్నాంనీ ఫ్రాన్స్ పాలించేది. అయితే 1940లో ఫ్రాన్స్ నీ ఓడించిన జపాన్…వియత్నాంనీ ఆక్రమించుకోవడం జరిగింది. అయితే 1945లో అమెరికా న్యూక్లియర్ బాంబు వేయడంతో జపాన్ ఓటమి చెందడం జరిగింది. దీంతో..వియత్నాం నుండి జపాన్ వెనక్కి తగ్గడం జరిగింది. ఈ పరిణామంతో వియత్నాంను స్వతంత్ర దేశంగా ఆ దేశ కమ్యూనిస్టు నాయకుడు హోచిమాన్ ప్రకటించడం జరిగింది. దీంతో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఫ్రాన్స్ దేశం వియత్నాంనీ ఆక్రమించుకోవడం జరిగింది. ఈ క్రమంలో హోచిమిన్ తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఫ్రాన్స్ నీ అభ్యర్థించిన… వినలేదు. దీంతో 1950లో ఫ్రాన్స్..వియత్నాం మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో కమ్యూనిస్టు దేశాలైన చైనా, రష్యా..వియత్నాంకి మద్దతుగా నిలిచాయి. మరోవైపు ఫ్రాన్స్ కి అమెరికా మరియు బ్రిటన్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో హోచిమిన్ అద్భుత పోరాట పటిమ చూపించి.. ఫ్రాన్స్ నీ ఓడించడం జరిగింది. అయితే ఫ్రాన్స్ …. వియత్నాం దేశం విడిచి వెళుతున్న సమయంలో ఉత్తర వియత్నం… దక్షిణ వియత్నంగా…  విడదీయడం జరిగింది.

What is Agent Orange..whats in it..and suffering of the Vietnamese details
Agent Orange
సివిల్ వార్ స్టార్ట్:

ఈ పరిణామంతో విభజించబడిన వియత్నాం.. రెండు దేశాల మధ్య దశాబ్దాలకు యుద్ధానికి బీజం వేసినట్లయింది. ఆ తర్వాత 1956 లో రెండు దేశాల మధ్య ఎన్నికలు జరగగా… ఉత్తర వియత్నంలో హోచిమాన్ ప్రభుత్వం.. ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ వియత్నంలో… డిఎం ఆధ్వర్యంలో డెమొక్రటిక్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ క్రమంలో ఉత్తర వియత్నం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. ఇక దక్షిణ వియత్నం విషయానికి వచ్చేసరికి భూములను సంపన్నుల చేతికి డీమ్ ప్రభుత్వం అప్పగించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే విధానం తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో దక్షిణ వియత్నంలో పేదవాళ్లు ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. అయితే ఎప్పటినుండో రెండు ప్రాంతాలను కలిపేయాలని కలలు కంటున్న హోచిమాన్.. దక్షిణ వియత్నం తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వటం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో దక్షిణ వియత్నం ప్రభుత్వానికి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. ఉత్తర వియత్నం గెలిస్తే తన ఆధిపత్య పోరుకు అనేక కష్టాలు వస్తాయని.. దక్షిణ వియత్నం సైనికులకు ఆయుధ సామాగ్రిని.. ఇంక మందు గుండు సామాన్లను.. అందించడంలో దాదాపు తొమ్మిది లక్షల కోట్లకు పైగానే అప్పట్లో అమెరికా ఖర్చు పెట్టడం జరిగింది.

What is Agent Orange..whats in it..and suffering of the Vietnamese details
Agent Orange
ఏజెంట్ ఆరెంజ్:

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉత్తర వియత్నం మరియు దక్షిణ వియత్నం మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా చివరిలో నేరుగా ఎంట్రీ ఇచ్చిన గాని… చివర ఆఖరికి ఉత్తర వియత్నం గెలవడం జరిగింది. ఈ క్రమంలో దక్షిణ వియత్నంలో ఉన్న అమెరికా అధికారులు సైతం పారిపోవలసిన పరిస్థితి నెలకొంది. అయితే యుద్ధంలో ఉత్తర వియత్నం గెలిచినా గాని అమెరికా.. యుద్ధంలో భాగంగా అనుసరించిన కొన్ని పనులకి ఉత్తర వియత్నం లో ఇప్పటికీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేటర్ లోకి వెళ్తే ఉత్తర వియత్నం.. మొత్తం వ్యవసాయంపై ఆధారపడిన దేశమని అందరికీ తెలుసు. ఈ క్రమంలో యుద్ధంలో భాగంగా యుఎస్ మిలటరీ బలగాలు ఏజెంట్ ఆరెంజ్ అనే కోడ్ తో… ఉత్తర వియత్నంలో అడవులను మరియు పొలాలను ఇంకా పండ్లు ఇచ్చే వృక్షాలను తొలగించడానికి హెర్బిసైడ్ కెమికల్స్ ఉపయోగించే ఆ ద్రవాలను… ఉత్తర వియత్నం పై.. విమానాల ద్వారా జల్లేది. ఈ రకమైన మిశ్రమం ద్వారా ఉత్తర వియత్నం దేశాన్ని వ్యవసాయంగా దెబ్బతీయటంతో పాటు ఉత్తర వియత్నం బలగాలు అడవులలో దాగు కొనకుండా.. మొత్తం చెట్లను ఈ రకమైన మిశ్రమాల ద్వారా నాశనం చేయడం జరిగింది.

What is Agent Orange..whats in it..and suffering of the Vietnamese details
Agent Orange
ఏజెంట్ ఆరెంజ్ లో వాడిన మిశ్రమం…వాటి ప్రభావం:

ఏజెంట్ ఆరెంజ్ అనే కోడ్ తో మాత్రమే కాదు పర్పుల్, బ్లూ, పింక్, మరియు గ్రీన్ అనే కోడ్ నేమ్ లతో అమెరికా బలగాలు వియత్నంపై అప్పట్లో విరుచుకు పడటం జరిగింది. TCDD వంటి ప్రమాదకరమైన కెమికల్స్ తో … “ఆపరేషన్ రంచ్ హ్యాండ్” అనే టైటిల్ తో … ఈ కెమికల్ లో డైక్సిన్ అనే ప్రమాదకరమైన మిశ్రమం.. ఉపయోగించటంతో ఇప్పటికీ ఉత్తర వియత్నం లో క్యాన్సర్ ఇంకా.. పలు అంగవైకల్యాలతో శిశువుల జన్మించటం, చర్మవ్యాధులు, గర్భస్రావంతో ప్రజలు ఇప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఆ మిశ్రమాలు ఉత్తర వియత్నం భూమిలో కూడా చొరబడటంతో అక్కడ పంట పండటానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి నెలకొంది. చిన్న దేశమైన ఉత్తర వియత్నం.. చివరిదాకా పోరాడి అమెరికాని పరుగులు పెట్టించింది. దీంతో యుద్ధం మధ్యలోనే అమెరికా పక్కకు వెళ్లిపోయింది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉత్తర వియత్నంపై రెండు లక్షల టన్నులకు పైగా బాంబులు.. వేయడంతో చాలామంది సామాన్యులు బలైపోయారు.  దశాబ్దాల పాటు జరుగుతున్న ఈ యుద్ధంలో దక్షిణ వియత్నానికి యూఎస్.. మద్దతు లేకపోవడంతో ఉత్తర వియత్నం సులువుగా ఆక్రమించింది. 1975లో పూర్తి అష్టగతం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత దక్షిణ మరియు ఉత్తర వియత్నం దేశాలు.. వియత్నం దేశంగా అవతరించింది. ఆధిపత్య పోరు కోసం ఒక చిన్న దేశమైన ఉత్తర వియత్నంపై పెద్దన్న అమెరికా..”ఆపరేషన్ రంచ్ హ్యాండ్” లో ఏజెంట్ ఆరెంజ్ అనేది.. అనేక విషాదాలను మిగల్చడం జరిగింది. ప్రమాదకరమైన కెమికల్స్ అప్పట్లో ఉపయోగించడంతో…వియత్నాం ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధిపత్య పోరు కోసం అహంకారంగా వియత్నం అమాయక ప్రజలను బలి తీసుకోవడంతో “వియత్నం వార్” లో అమెరికాకి దారుణమైన చెడ్డ పేరు రావటం జరిగింది. ఈ యుద్ధంలో భారీగా ఖర్చు పెట్టడంతో పాటు ఓటమి పాలు కావటంతో.. సొంత దేశంలో పన్నులు పెంచేయడంతో అమెరికా ప్రజల నుండి కూడా ఈ యుద్ధం విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పసి కూన లాంటి వియత్నం అమెరికాను .. పరుగులు పెట్టించటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ప్రస్తుతం దక్షిణాసియాలో వియత్నం అభివృద్ధి చెందిన దేశంగా.. ముందుకు సాగుతూ ఉంది.

Related posts

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Zelenskiy: రష్యా క్షిపణి దాడి నుండి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన మాజీ ఉన్నతోద్యోగులు .. వెయ్యి కోట్లకు దావా

sharma somaraju

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

sharma somaraju

Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ లో మరో సారి అధికార పీఠాన్ని కైవశం చేసుకున్న హసీనా .. ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel-Gaza War: గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ .. 15 మంది సైనికులు మృతి

sharma somaraju