దగ్గుబాటి సురేష్‌బాబుపై కేసు

Share

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కారు బీభత్సం సృష్టించింది. సురేష్‌బాబుకు చెందిన సురేష్‌బాబుకు చెందిన టీఎస్‌09ఈఎక్స్‌2628 నెంబరు గల కారు ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. రాంగ్‌‌రూట్‌‌లో దూసుకెళ్లిన ఆయన కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ మేరకు కార్ఖానా పోలీస్ స్టేషన్‌‌లో సురేష్‌బాబుపై ఐపీసీ సెక్షన్ 337 కింద కేసు నమోదు చేశారు. సురేష్‌బాబుకు 41ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సురేష్‌బాబు కారు ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బైక్‌‌ను సురేష్‌బాబు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న మూడేళ్ల చిన్నారికి, దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారికి గాయాలు తీవ్రంగానే అయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ ముగ్గురినీ స్థానికులు యశోద ఆసుపత్రికి తరలించారు.


Share

Related posts

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

Siva Prasad

బిత్తిరి సత్తి కి పర్మినెంట్ జాగా దొరికినట్లేనా..?

somaraju sharma

rashmi gautam: ఏంటి ఇంత అందంగా ఉంది , ఈ డ్రెస్ లో జబర్దస్త్ షో కి వెళితే అంకుల్స్ మతులు పోతాయి!

Teja

Leave a Comment