Iliyana: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానాకి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొత్తంలో పోకిరి సినిమా ఒక హైలెట్ అని చెప్పవచ్చు. ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ నాజుకు సుందరి ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమయింది.
Iliyana: ఇలియానా సూసైడ్
బాలీవుడ్ లో అంతగా పాపులర్ కాలేదు ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత ఆండ్రూ నిబోన్ తో ప్రేమలో పడి అతనితో సహజీవనం చేసింది. ఈ సమయం నుంచి సినిమాల్లో ఈమె ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెపై దుష్ప్రచారం జరిగింది. అదేంటంటే ఆమె పెళ్లి చేసుకోక ముందే ప్రెగ్నెంట్ అయినట్టు వార్తాకథనాలు హల్ చల్ చేశాయి. ఇలియానా పెళ్ళికి ముందే గర్భం ధరించిందని.. అబార్షన్ కూడా ప్లాన్ చేసిందని.. ఈ ప్రెగ్నెన్సీ ఆమె సూసైడ్ థాట్స్ కి కూడా దారితీసిందని కథనాలు ప్రచారం సాగించాయి.
అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాక్!
ఈ ప్రచారంపై ఇలియానా స్పందించింది. తానెప్పుడూ సూసైడ్ అట్టెంప్ట్ కి పాల్పడలేదని ఆమె స్పష్టం చేసింది. తాను చచ్చిపోలేదని, దేవుడి దయ వల్ల ఇప్పటికీ సజీవంగానే ఉన్నానని నవ్వుతూ రూమర్లను పటాపంచలు చేసింది. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రచారం కూడా మీడియా కథనాలు మొదలెట్టాయి. ఇలియానాని బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని.. తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. అందుకే బొద్దెక్కిందని ప్రచారం సాగింది. అంతేకాదు ఈమె బాడీ షేమింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి.
అయితే వీటిలో నిజం లేదని ఇలియానా తాజాగా చెప్పుకొచ్చింది. 12 ఏళ్ల వయసు నుంచే బాడీ షేమింగ్ కి తాను గురయ్యానని కానీ ఎప్పుడూ కూడా దీని వల్ల తాను సూసైడ్ చేసుకోవాలనుకోలేదని చెప్పింది. అయితే తన జీవితంలో ఒకానొక సమయంలో చాలా బాధలో మునిగి తేలానని ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలని తనకు అనిపించినట్లు ఆమె చెప్పి షాక్ ఇచ్చింది. అయితే అలా ఎందుకు ఆమె అనుకుందో ఎవరికీ చెప్పలేదు. ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.