NewsOrbit
మీడియా

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి.  సరిగ్గా ఆ సమయం రవిప్రకాష్ అరెస్ట్ అని సోషల్ మీడియాలో హడావుడి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లేదా నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి టీవీ ఛానళ్ళను సంప్రదించక తప్పదు. అన్ని ఛానళ్ళలో వార్తలు లేవు, కార్యక్రమాలు లేవు, కేవలం అరగంట వ్యవధి ప్రకటనా కార్యక్రమాలు. కొన్నింటిలో స్క్రోలింగుల్లో పోలీసు అదుపులో అంటూ సమాచారం. కొత్త యాజమాన్యం వచ్చాక సుమారు 18 కోట్ల రూపాయల దాకా రవిప్రకాష్, మూర్తిగార్లు స్వాహా చేశారని అభియోగం. ఇందులో కూడా పెరీరా పేరుతో 6 కోట్లు, తన పేరుతో 6 కోట్లు మాయం చేశారని సమాచారం. రాత్రికి చంచల్ గూడా జైలుకు తరలించి సాధారణ ఖైదీగా (నెం.4412) పంపారని విశేషం. ఆయన వార్తల్లో వ్యక్తి కనుక ఖైదీ నెంబరు, తినని కిచిడి, కృష్ణాబ్యారక్, ముభావం అన్న సమాచారాలు కూడా వచ్చాయి.

అంతా సద్దు మణిగింది. ఆయన ఏదో ఛానల్ కు సమాయత్తమవుతున్నాడు.  మై హోం యాజమాన్యం కూడా పట్టు సడలించింది – అనే గ్యాసిప్ తారట్లాడుతున్న సమయంలో ఈ వార్త వచ్చింది. అయితే ఈసారి ఏ వార్తా ఛానల్ కూడా ఉత్సాహపడలేదు, ఉరకలు వేయలేదు. కాస్త నిదానంగా, మితంగా వార్తలు ఇచ్చాయి. వాటిలో మెరుగైన సమాజం కోసం అరెస్టు అనే నామకరణాలు లేకపోలేదు. సుమారు దశాబ్దం క్రితం ఒక మాసపత్రిక సంపాదకుడు రమణమూర్తి స్నేహితుడిని హత్య చేయించాడన్న వార్త తర్వాత బహుశా ఈ వార్త మాత్రమే అంతకు మించి సంచలనం కలిగించింది.

రవిప్రకాష్ వార్తలు ఇట్లా ఉండగా; హైదరాబాదులో ఈఎస్‌ఐ స్కామ్ వివరాలు నెమ్మదిగా వస్తున్నాయి, అరెస్టులవుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో పాలుపంచుకున్న జర్నలిస్టు ఎవరో, ఆయన పనిచేసే ఛానల్ ఏదో ఇంకా బయటికి రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వీధీపోరాటాల స్థాయి నుంచీ సోషల్ మీడియా పోస్టింగుల పోరాటాల దాకా దిగజారాయి. వీటిని ఖండిస్తూ ప్రతిపక్ష నాయకుడు గంటకు మించి మాట్లాడటం, దీనిపై టీవీ న్యూస్ మీడియా గంటల తరబడి చర్చలు పెట్టడం ఒక అంశం కాగా; సోషల్ మీడియాను కంట్రోలు చేయాలని యాంకర్లు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ప్రశ్నలు వేయడం గమనార్హం. శృతిమించిన తర్వాత, గతి తప్పాక ఎక్కడికి వెడతామో తెలీదు. అమెరికా ప్రెసిడెంట్ ‘ట్రంప్’ను టీవీ ఛానల్ థర్డ్ పర్సన్ సింగులర్ లో వాడాల్సిన అగత్యం ఏమిటి? అమెరికా వారు తమ ఛానల్ చూడరనే నమ్మకం ఎక్కువ ఉండవచ్చు. వార్తల్లో వ్యంగ్యమో తెలీని మాస్ మల్లన్న, గోలీమార్ లలో ఇలాంటి పనులు జరుగుతుంటాయి.

ఆదివారం రాత్రి ఛానళ్ళు అన్నీ బతుకమ్మ సంబరాల ప్రత్యక్ష ప్రసారాలతో సేదదీరుతున్న వేళ్ళ టీవీ 5 మానవాసక్తికర కథనం ఒకదాన్ని వివరంగా ప్రసారం చేసింది. ఒరిస్సా సరిహద్దు నుంచి ఆవులు, ఎద్దుల్ని కబేళాకు హీనంగా తరలిస్తున్నారని ఆ వార్త. ఏ రకంగా హింసిస్తున్నారో, చట్టవ్యతిరేకంగా ఏం చేస్తున్నారో చాలా వివరంగా, దృశ్య సహితంగా వార్త సాగింది. మామూలుగా టీవీ ఛానళ్ళను చూస్తూ మార్చుకోవడమే కానీ ఆగి చూడటం ఉండదు. అయితే ఈ వార్త ఆ పనిని విజయవంతంగా చేయించింది. ఈ వార్తను పంపిన జర్నలిస్టుకు దాన్ని ఎంపిక చేసిన ఎడిటర్‌కు అభినందనలు చెప్పాలి. అలాంటిదే మరోటి టీవీ 9లో కుప్పం ప్రాంతంలో కాన్సర్ వార్త – వక్కాకు తినడంవల్ల నోటి కాన్సర్ విపరీతంగా వస్తోందని వివరంగా చేసిన కథనం ‘అనగనగా’ ఒక ఊరులో ప్రసారమైంది. గతవారం కొండగట్టు ప్రమాద బాధితుల గురించి ప్రసారం చేశారు.

వారం వారం టీవీక్షణంలో కలుసుకుందాం, టీవీ కార్యక్రమాల మంచిచెడ్డలు ఉదాహరణలతో విప్పి చెప్పుకుందాం!

డా. నాగసూరి వేణుగోపాల్

9440732392

author avatar
Siva Prasad

Related posts

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Mahesh: ఎమోషనల్ అయిన మహేష్‌బాబు పోస్ట్ వైరల్.!

Deepak Rajula

Petrol : కేవలం రు.1/-కే లీట‌ర్ పెట్రోల్‌ దొరకడంతో పోటెత్తిన జనం.. రంగంలోకి పోలీసులు!

Deepak Rajula

Iliyana: టాప్ హీరోయిన్ ఇలియానా సూసైడ్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్!

Deepak Rajula

Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

arun kanna

CJI Ramana: మీడియా తీరుపై హ‌ర్ట‌యిన సీజేఐ ర‌మ‌ణ‌.. సుతిమెత్త‌గా క్లాస్ తీసుకొని…

sridhar

Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!

sridhar

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

sridhar

Times Indu Jain: మహమ్మారి కాటుతో దేశంలోని మీడియాధిపతి.., కుబేర వనిత కన్నుమూత..!

Srinivas Manem

KCR: బ్రేకింగ్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క‌రోనా

sridhar

Tv Debates : మీడియా చర్చల్లో ముష్టియుధ్దాలే మిగిలాయా..!? చానెల్స్ చేసేది ఇదేనా..?

Muraliak

Leave a Comment