NewsOrbit
మీడియా

తాత్కాలిక ఉడుకుతనం సరిపోతుందా!?

హైదరాబాదు శివార్లలో జరిగిన  మానభంగం, హత్యకు సంబంధించిన వార్త నాలుగు రోజులుగా ఛానళ్ళనూ, సమాజాన్నీ కుదిపేస్తోంది! తెలుగు ఛానళ్ళకన్నా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో దీన్ని గురించి నిర్వహించిన డిబేట్‌ను ఆ ఛానల్‌లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ చూశారు. రాజకీయనాయకుల బాధ్యత గురించీ, దానిని పట్టించుకోనితనం గురించీ ఆయన కడిగిన తీరు, అసంతృప్తి మధ్యతరగతి జనానికి వేడుక అయ్యింది. ఆయన అరుపులు ఏ స్థాయిలో ఉన్నాయంటే అక్కడున్న ప్రముఖులను కొట్టడం ఒకటే తక్కువ! ఈ కార్యక్రమం ముక్కలు ముక్కలుగా సోషల్ మీడియాలో గిరికీలు కొట్టింది. స్పందించని రాష్ట్ర ప్రభుత్వం గురించి టి.ఆర్.ఎస్. పార్లమెంటు సభ్యుణ్ణి దులిపేశారు. పార్లమెంటుకు ఎందుకు వెళ్ళాలి, పార్లమెంట్ నుంచి వెళ్ళిపోండి, నన్ను పార్లమెంటు శిక్షించినా ఫర్వాలేదు అని ఆర్నబ్ ఊగిపోయాడు. టి.ఆర్.ఎస్.కు  తొమ్మిదిమంది పార్లమెంటు సభ్యులున్నారు కనుక ఏ యితర రాజకీయ పక్షం కూడా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తలేదు అని పార్టీల పేర్లతో సహా విమర్శించాడు. రిపబ్లిక్ టీవీ బిజేపీ సానుభూతిపరులదని అంటారు. అయితే ఆయన ఆ పార్టీని కూడా మినహాయించలేదు.

తెలుగు న్యూస్ ఛానళ్ళు అన్నీ నాలుగు రోజులుగా దీని గురించే వార్తలు, చర్చలు, వ్యాఖ్యానాలు ఇస్తున్నాయి. ఇందులో వెలుగు కన్నా వేడిమి పాలే ఎక్కువ. ఉరే సరి అనే రీతిలో కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.  సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించిన తీరు ఆలోచనాత్మకం. ప్రజల ముందు గొట్టాలు పెట్టడం కాదు;  మీరేమంటారు చెప్పండి అటూ సంపాదకులనీ, యాజమాన్యాలనూ ప్రశ్నించారు. వారు ఏమీ మాట్లాడకుండా, తమ పాలసీ చెప్పకుండా కార్యక్రమాలు చేస్తూ పోవడం సరికాదు అని ఆయన అభిప్రాయం.

ఈ నేపథ్యంలో అన్ని ఛానళ్ళలో ఎన్నో చర్చలు జరిగాయి. ఎంతోమంది మహిళలు పాల్గొన్నారు. కనీసం ఇప్పుడయినా మహిళల అభిప్రాయాలు ఖాతరు చేయాలనుకోవడం అభినందనీయం. అప్పుడప్పుడు కనిపించే వారితోపాటు ఎంతోమంది మహిళలు, యువతులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సమస్యకు సంబంధించి చాలా పార్శ్వాలు ప్రస్తావనకొచ్చాయి. అయితే ఎవరైనా ఈ కార్యక్రమాలను జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. లాయర్ ఆకుల రమ్య, డాక్టర్ వీరపనేని పద్మగార్లు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడారు. తమ పిల్లలనే తల్లీ, తండ్రీ దారికి తెచ్చుకోలేకపోతే పోలీసులు, ప్రభుత్వం ఏమి చేయగలదు అనేది కీలకమైన ప్రశ్న. అలాగే గంజాయి, మద్యం, మొబైల్ ఫోన్ అశ్లీలత విచ్చల విడిగా లభ్యమైతే – దాని గురించి ఆలోచన వద్దా అనేది కూడా అంతే కీలకమైన విషయం. పెడధోరణులతో పుచ్చిపోయి, రెచ్చిపోయిన యువకులకు మేమెందుకు బలి కావాలి, వ్యభిచారానికి లైసెన్సు ఏర్పాటు చేయండి – అనే యువతి ఆవేదనాత్మక ప్రశ్న కూడా ఆలోచనీయం.

ఆవేశం కల్గినప్పుడు ఊగిపోయి, తర్వాత మరిచిపోవడమే మన విధానమా? ప్రియాంక హత్యకు గురయితే నిర్భయ కేసు ఏమైందనే ప్రశ్న రావడం ఏమిటి? ఏబిఎన్‌లో మహేష్ బాబు ఖండనాత్మక ప్రకటన పదే పదే కనబడింది. ఆదివారం సాయంకాలం ఎన్ టీవీ, వనితా ఛానళ్ళు రెండు రాష్ట్రాలలో పలుచోట్ల కొవ్వొత్తుల ర్యాలీలను ఏర్పాటు చేసి, ప్రత్యక్షప్రసారం చేశాయి.

ఇటువంటి సందర్భాలలో కేవలం ఆడవాళ్ళే మాట్లాడాలా? ఈ సమస్యపై పురుషులు చేసే ఆలోచన ఏమీ ఉండదా? మగవారి కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా! అభిప్రాయాలు, నిర్ణయాలు, చట్టాలు చేయడంలో మహిళల కన్నా పురుషులదే ప్రధానపాత్ర అని వాస్తవ ప్రపంచం చెబుతోంది. ఇక్కడ దీని గురించి మాట్లాడినవారిలో పురుషులు తక్కువే. అలాగే సాక్షి, 10 టీవీ, టీవీ5, వి6 వంటి ఛానళ్ళు మహిళా యాంకర్లతో కార్యక్రమాలు నిర్వహించాయి. దీనికి అభినందనలు చెప్పాలి.

అందరూ సిగ్గుతో, అవమానంతో తలదించుకునే పరిస్థితిని ఈ సందర్భం కల్పించింది. దీనికి నేపథ్యం చాలా కారణాలు, చాలా విధాలుగా ప్రేరేపించాయి. ఆ దిశలో సమగ్రమైన అధ్యయనం, సవ్యమైన పరిష్కారం కోసం ఛానళ్ళు ప్రయత్నించాలి.

డా. నాగసూరి వేణుగోపాల్

author avatar
Siva Prasad

Related posts

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Mahesh: ఎమోషనల్ అయిన మహేష్‌బాబు పోస్ట్ వైరల్.!

Deepak Rajula

Petrol : కేవలం రు.1/-కే లీట‌ర్ పెట్రోల్‌ దొరకడంతో పోటెత్తిన జనం.. రంగంలోకి పోలీసులు!

Deepak Rajula

Iliyana: టాప్ హీరోయిన్ ఇలియానా సూసైడ్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్!

Deepak Rajula

Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

arun kanna

CJI Ramana: మీడియా తీరుపై హ‌ర్ట‌యిన సీజేఐ ర‌మ‌ణ‌.. సుతిమెత్త‌గా క్లాస్ తీసుకొని…

sridhar

Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!

sridhar

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

sridhar

Times Indu Jain: మహమ్మారి కాటుతో దేశంలోని మీడియాధిపతి.., కుబేర వనిత కన్నుమూత..!

Srinivas Manem

KCR: బ్రేకింగ్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క‌రోనా

sridhar

Tv Debates : మీడియా చర్చల్లో ముష్టియుధ్దాలే మిగిలాయా..!? చానెల్స్ చేసేది ఇదేనా..?

Muraliak

Leave a Comment