18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
National News India జాతీయం

Republic Day: మొదటి రిపబ్లిక్ డే ప్రధాని నెహ్రూ స్పీచ్.. ఈనాటి రిపబ్లిక్ డే హైలెట్స్..!!

Share

Republic Day: దేశ ప్రజలందరూ భారతదేశ సార్వభౌమ ప్రజాస్వామ్య బద్దంగా దేశము రూపొందించబడాలని కాంక్షించారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భద్రత, న్యాయం, సామాజికంగా ఇంకా ఆర్థిక పరంగా… రాజకీయంగా అందరికీ సమాన హక్కులు కల్పించే దిశగా 1949 జనవరి 26.. రాజ్యాంగ పరిషత్ ఆమోదించటం జరిగింది. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం వేచించి రాజ్యాంగం రూపొందించబడింది అనీ నెహ్రు తన మొదటి స్పీచ్ లో తెలియజేయడం జరిగింది. దేశంలో అందరకీ స్వంత్రత … అందరికీ సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దేశంలో కుల మరియు మత రూపంలో అసమానతలు తొలగించడం ప్రధమం. ప్రజాస్వామ్యం వైపు సామాజికంగా నిలబడటమే మా యొక్క ప్రధమ ఉద్దేశం.

First Republic Day Prime Minister Nehru's Speech.. Today's Republic Day Highlights

మా యొక్క లక్ష్యం సమన్యాయం దిశగా సామాజిక లక్ష్యం నెరవేర్చడమే. ప్రస్తుతం దేశంలో ప్రజల జీవన విధానం చాలా దుర్భరంగా ఉంది. అన్ని రకాలుగా వారిని పైకి తీసుకురావటమే మా యొక్క లక్ష్యం. చాలామంది పేదరికంతో బాధపడుతూ ఉన్నారు. ఇది దేశానికి అంత మంచిది కాదు. తప్పుధోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తే ప్రజలలో ఏమాత్రం అభివృద్ధి కనిపించదు అనేది నేను చాలా బలంగా నమ్ముతాను. హింస అనేది ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనే విధానానికి నేను చాలా వ్యతిరేకం. దేశంలో ప్రజల జీవన విధానం పోటీ తత్వంలో కాదు… కలుపుకునే రీతిలో ప్రజాస్వామ్యాన్ని తీర్చేదిద్దటమే ప్రధానం. 1950 జనవరి 26 మొదటి గణతంత్ర దినోత్సవంలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగించడం జరిగింది. ఒకరి మంచి అందరికీ మంచే చేసే విధంగా దేశంలో పరిస్థితులు ఉండాలని తన ప్రసంగంలో తెలియజేశారు.

First Republic Day Prime Minister Nehru's Speech.. Today's Republic Day Highlights

మొదటి “రిపబ్లిక్ డే” రోజు ఢిల్లీలో ఆ సమయంలో మంచి హడావిడి వాతావరణం నెలకొంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా బ్రిటిష్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడే నెహ్రూ, శ్రీ రాజగోపాలచారి ఉన్నారు. ఆరోజు ఉదయం స్టేడియంలో జాతీయ జెండాను ఎగరేశారు. ఆ తర్వాత పెరేడ్ ప్రారంభమైంది. బ్రిటిష్ అధికారులు మొత్తం భారతదేశము నుండి వెళ్లిపోవడంతో భారత్ పూర్తిగా స్వతంత్ర దేశంగా పురుడు పోసుకుంది. ఆ సమయంలో అంతర్థానమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయనను చూడాలని ఎంతోమంది ప్రజలు మైదానానికి చేరుకున్నారు. కానీ ఆయన జడ అప్పటికి తెలియలేదు. మొదటి రిపబ్లిక్ వేడుకల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, సైనిక దళాలు కూడా పాల్గొన్నారు. ఆరోజు దేశవ్యాప్తంగా ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా చెప్పుకోవటం జరిగిందట.

First Republic Day Prime Minister Nehru's Speech.. Today's Republic Day Highlights

అయితే నేడు 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో… ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించటం జరిగింది. ఈ వేడుకలలో త్రివర్ణ పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఈజీప్ర అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. రాష్ట్రపతి తో కలిసి ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇంకా ఇదే వేడుకలలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోడీ పలుమూరు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. భారత సైనికులతో పాటు ఈజిప్టు నుండి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం కూడా ఈ కవాతులో పాల్గొనడం జరిగింది. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో.. నౌకాదళం మరియు వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

First Republic Day Prime Minister Nehru's Speech.. Today's Republic Day Highlights

గణతంత్ర దినోత్సవ పరేడ్ కీ రాకముందు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోడీ అమరవీరులను స్మరించుకున్నారు. వారికి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధాని మోడీ వెంట త్రివిధ దళాధిపతులు కూడా ఉండి నివాళులర్పించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొనడం జరిగింది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ నందు “ఆత్మ నీర్భర్”  కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


Share

Related posts

ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆ సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు

somaraju sharma

Sonia Gandhi: ఈడీ విచారణకు సోనియా డుమ్మా..! ఎందుకంటే..?

somaraju sharma

ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి .. ముగ్గురు జవాన్లు వీర మరణం

somaraju sharma