Rajyasabha: రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు ముగ్గురు..!!

Share

Rajyasabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఆ నలుగురు ఎవరంటే దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తండ్రి సినీ రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad), ప్రముఖ అథ్లెట్ పిటి ఉష(PT Usha), సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja), స్వచ్ఛంద సేవకుడు వీరేంద్ర హెగ్డే(Veerendra Heghde) నామినేట్ అయ్యారు. వీరందరూ దక్షిణాదికి చెందిన వాళ్ళు కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురిని  సోషల్ మీడియా వేదికగా అభినందించారు. దీనిలో భాగంగా రాజమౌళి.. తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

విజయేంద్ర ప్రసాద్ సినీ రంగానికి చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విజయేంద్ర ప్రసాద్ భారత్ సంస్కృతిని ప్రతిబింబించేలా సినీ రంగానికి సేవలందిస్తున్నారని కొనియాడారు. విజయేంద్ర ప్రసాద్ కృషి వల్ల భారత సంస్కృతి విశ్వవ్యాప్తమయిందని స్పష్టం చేశారు. దీంతో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జక్కన్న తెరకెక్కించిన చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ స్టోరీ రాయటం జరిగింది.

సింహాద్రి, చత్రపతి, బాహుబలి, RRR.. ఇంకా పలు సినిమాలకు కథలు అందించారు. అంత మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ హిట్ చిత్రం “బజరంగీ భాయిజాన్” కి కూడా విజయేంద్రప్రసాద్ స్టోరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చెయ్యబోయే సినిమాకి కూడా కథ రాస్తూ ఉన్నారు. భారతదేశ సినిమా రంగం కీర్తి ప్రపంచ సినిమా రంగానికి తెలిసేలా సినిమాల స్టోరీలు అందించిన విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావటం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

1 నిమి ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

26 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago