NewsOrbit
జాతీయం న్యూస్

మరో 12 చీతాలు వచ్చేశాయోచ్ .. కునో పార్క్ లో విడుదల చేసిన సీఎం చౌహాన్..

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు మరో 12 చీతాలు (చిరుత)లు చేరాయి. దక్షిణాఫ్రికా నుండి భారత వైమానిక దళానికి చెందిన సీ – 17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానంలో 12 చీతాలు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ విమానాశ్రయాకి చేరుకోగా, అక్కడ నుండి 12 చిరుతలను హెలికాఫ్టర్ లో కునో నేషనల్ పార్క్ కు తరలించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వీటికి స్వాగతం పలికి కునో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. ఇందులో ఏడు మగ, ఆరు ఆడ చీతాలు ఉన్నాయి. వీటి కోసం పార్క్ లో పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్దం చేశారు.

12 cheetah from south africa release in kuno national park

 

నిబంధనల ప్రకారం నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్ లో ఉంచనున్నారు. కొద్ది రోజులు చిన్న ఎన్ క్లోజర్ లో ఉంచి .. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే విధంగా చేసిన అనంతరం వాటిని ఓపెన్ ఫారెస్ట్ లో వదిలేస్తారు. ఇంతకు ముందు 2020 సెప్టెంబ్ నెలలో ఎనిమిది చిరుతలను నమీబీయా నుండి తీసుకువచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్ లో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నమీబియా నుండి వచ్చిన ఎనిమిది చిరుతలను విడుదల చేశారు. తాజాగా వచ్చిన 12 చిరుతలతో కూనో పార్క్ లో చిరుతల సంఖ్య 20కి పెరిగింది.

12 cheetah from south africa release in kuno national park

 

1948 తర్వాత దేశంలో చిరుతల (చీతా) ఆనవాళ్లు కనుమరుగు అయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునః ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నమీబియా నుండి తొలుత 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ కు తరలించారు. వీటి సంఖ్యను పెంచుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ధక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో భాగంగా 12 చిరుతలు నేడు దేశానికి చేరుకున్నాయి. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.

చంద్రబాబుపై పలువురు మంత్రులు ఫైర్ ..ఎవరు ఏమన్నారంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju