జాతీయం న్యూస్

300 ఏళ్లనాటి అరుదైన దేవతా విగ్రహాల స్వాధీనం.. అవి ఎక్కడివంటే..?

Share

పురాతన విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సరైన దృవ పత్రాలు లేకుండా పురాతన విగ్రహాలను ఇళ్లలో ఉంచుకోవడం కూడా నిషేదమే. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ఇంటి నుండి ఐడల్ వింగ్ పోలీసులు ఎంతో విలువైన, అరుదైన దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాలు దాదాపు 300 ఏళ్ల నాటివిగా గుర్తించారు. చెన్నై అన్నానగర్ లోని ఓ వ్యక్తి నివాసంలో పురాతన విగ్రహాలు ఉన్నాయన్న సమాచారంతో తమిళనాడు పోలీసు అధికారులు అతని నివాసంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అతని నివాసంలో రెండు విగ్రహాలు దొరికాయి. కూర్చున్న భంగిమలో ఉన్న మహియమ్మన్ విగ్రహంతో పాటు నాట్యం చేస్తున్న నాటరాజన్ విగ్రహాలు దొరికాయి. రెండు విగ్రహాలు కూడా అత్యంత పురాతనమైనవిగా.. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పోలీసు అధికారుల విచారణ చేసిన సందర్భంలో ఆ ఇంట్లో ఉన్న మహిళ .. ఇవి తాను పుట్టకముందు నుండి తమ తల్లిదండ్రులు కల్గి ఉన్నారని తెలిపింది. వాటికి సంబంధించిన కాగితాలు తన వద్ద ఏమీ లేవని చెప్పింది. ఈ విగ్రహాలు ఎక్కడివో తెలియదని వివరించింది. అయితే వేడుక సమయంలో ఈ విగ్రహాలను బయటకు తీసి ఆలయ పల్లకిలో అమర్చే విధంగా గుర్తులు ఉండటంతో ఇవి కఛ్చితంగా ఆలయ విగ్రహాలే అని పోలీసులు భావిస్తున్నారు. ఇవి పురాతన విగ్రహాలనీ, బహుశా దేవాలయాల నుండి దొంగిలించిన వ్యక్తి ఈ వ్యక్తి పూర్వికులకు విక్రయించి ఉండవచ్చని పోలీసులు భావించారు. సదరు వ్యక్తి ఇంట్లో ఈ విగ్రహాలకు సంబంధించి సరైన ఆధారాలు ఏమీ చూపకపోవడంతో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విగ్రహాలు ఎక్కడవి అనేది తెలుసుకునేందుకు గానూ పోలీసులు .. గతంలో ఆలయాల్లో ఎక్కడెక్కడ విగ్రహాలు చోరీకి గురి అయ్యయి అనే సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైయ్యారు. ఐజీపీ ఆర్ దినకరన్, ఐడల్ వింగ్ సీఐడీ డీజీపి కే జయంత్ మురళి ఆదేశాల మేరకు ఐడవ్ వింగ్ ఎస్పీ పి రవి, డీఎస్పీ ముత్తురాజు, ఇన్స్ పెక్టర్ రవీంద్రన్, వాసంతి లు ఈ విగ్రహాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఖైరతాబాద్ గణనాధుడి వద్ద ఉద్రిక్తత .. ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలంటూ వీహెచ్ పీ ఆందోళన


Share

Related posts

ఇలా కూర్చోవడం వలన ఏమి జరుగుతుందో తెలుసా??

Kumar

Prision: వయసు 25 ఏళ్లే కానీ.. వీడు మామూలోడు కాదు..!!

somaraju sharma

Bigg boss 4: సోహెల్, అఖిల్.. ఇద్దరూ మిత్రులా? లేక శత్రువులా?

Varun G