NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Earthquake: ఉత్తరాదిని వణికించిన భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతగా నమోదు

Advertisements
Share

Earthquake: ఉత్తర భారతదేశంలో మంగళవారం భూకంపం ఆందోళనకు గురి చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్ లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదు అయ్యింది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలో మీటర్ల దూరంలో 6 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు వచ్చాయి. పది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ల నుండి వీధుల్లోకి పరుగులు తీశారు.

Advertisements
Earthquake

మణిపూర్ లో స్వల్పంగా భూమి కంపించగా, పాకిస్థాన్ లోని లాహోర్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం ధాటికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు తెలియరాలేదు. భూకంపానికి సంబంధించి ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే భూకంప ప్రభావంతో ఇళ్లలోని వస్తువులు ఊగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆఫ్ఘనస్తాన్ లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివరిలో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisements

 

 


Share
Advertisements

Related posts

బిగ్ బాస్ 4 : ఇంటర్వ్యూలో మోనాల్ గుట్టు బయటపెట్టిన సుజాత..! పగలు ఒకరితో రాత్రి మరొకరితో….

arun kanna

బాలినేని సన్నిహితుడు ముద్దన వైసిపికి బైబై

somaraju sharma

చంద్రబాబుకి ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నా ఏపీ మంత్రి..!!

sekhar