ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్ధి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. షెల్లీ ఒబెరాయి తన సమీప బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా షెల్లీ ఒబెరాయి కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలుగా సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో మేయర్ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆప్ విజయం సునాయసమైంది.

150 స్థానాలు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగ్గా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 104 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితం అయ్యింది. మేయర్ ఎన్నికకు ఆప్ స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ బీజేపీ మేయర్, డిప్యూటి మేయర్ అభ్యర్ధులుగా రేఖా గుప్తా, కమల్ బాగ్రి లను ప్రకటించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కును కల్పిస్తూ ఢిల్లీ ఎల్జీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మేయర్, డిప్యూటి మేయర్, ఎంసీడీ స్టాండింగ్ కమిటీలోని 18 మంది సభ్యుల ఎన్నికకు ఇంతకు ముందు మూడు సార్లు ఎంసీడీ సమావేశమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే వాయిదా పడ్డాయి.
నామినేటెడ్ సభ్యులను ఓటింగ్ కు ఎల్జీ అనుమతించడాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఆ పరిస్థితి తలెత్తింది. మేయర్ ఎన్నికకు ఈ నెల 16వ తేదీని ఎల్జీ ప్రకటించగా, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ను కల్పించే ఎల్జీ నిర్ణయాన్ని ఆప్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీం కోర్టు గత శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఎంసీడీ మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు బిగ్ రిలీఫ్ .. జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశాలు