జాతీయం న్యూస్

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట

Share

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తీస్తా సెతల్వాద్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. సాధారణ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు పాస్ పోర్టును ట్రయల్ కోర్టు వద్ద సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు అధారాలను రూపొందించారన్న ఆరోపణలపై ఆమెను జూన్ 25న అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం తీస్తా చేసుకున్న ధరఖాస్తుపై నేడు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Activist Teesta Setalvad Gets Bail

 

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అండతో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా చేపట్టిన భారీ కుట్రలో తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ శ్రీకుమార్ భాగమన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తొంది. ఈ మేరకు సెక్షన్ 468, 194 ప్రకారం దాఖలైన కేసులపై అహ్మదాబాద్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపడుతోంది. ఈ కేసులోనే ముంబాయి శాంటాక్రూజ్ లోని నివాసంలో సెతల్వాద్ ను జూన్ 25న అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అహ్మదాబాద్ సెక్షన్ కోర్టు తీస్తా సెతల్వాద్ కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. సెతల్వాద్ తో పాటు మాజీ డీజీపీ శ్రీకుమార్ కు బెయిల్ నిరాకరించింది. దీనిపై వీరు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన హైకోర్టు .. సిట్ కు నోటీసు జారీ చేసి తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. ఈలోగా తీస్తా సెతల్వాద్ మద్యంతర బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి బిగ్ రిలీఫ్ ..మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు..


Share

Related posts

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

sarath

బిగ్ బాస్ సీజన్ 4 ప్లాన్స్ ఇవే ..!

GRK

Nagarjuna : కొత్త వాళ్ళలో ఉండే కసి నాగార్జున బాగా పసిగట్టాడు

GRK