NewsOrbit
జాతీయం న్యూస్

ఆదానీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ .. కమిటీ ఏర్పాటుపై నిర్ణయాన్ని వ్యక్తం చేసిన కేంద్రం  

ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పెట్టుబడిదారుల భద్రతను నిర్దారించేందుకు కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సెబీ చూస్తొందని కోర్టుకు తెలియజేశారు. ఆదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటివి జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

Supreme Court

 

ఈ పిటిషన్ల పై ఇంతకు ముందు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు.. కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కమిటీ సభ్యులు, పరిధి, విచారణాంశాలను సీల్డ్ కవర్ లోనే కోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆదానీ గ్రూప్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఏజీ పేర్కొన్నారు. అందుకే కమిటీ పరిధి, విచారణాంశాలను బుధవారం సీల్డ్ కవర్ లోనే ఇస్తామని ఏజీ తుషార్ మెహతా తెలిపారు. హిండెన్ బర్గ్ అంశంపై విచారించే శక్తి సామర్థ్యాలు సెబీ దగ్గర ఉన్నాయని ఏజీ తుషార్ మెహతా పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, కమిటీ పరిధి, విచారణాంశాలు అందిన తర్వాత తీర్పు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీ శుక్రవారంకు వాయిదా వేసింది.

ఆగని విపక్షాల ఆందోళన ..మార్చి 13కు రాజ్యసభ వాయిదా

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju