Agnipath Protests: అగ్నిపథ్ పథకం పై దేశ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్ధుల నుండి ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఆ పథకాన్ని నిలుపుదల చేసి పాత పద్దతిలోనే ఆర్మీలో నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అగ్నిపథ్ పథకాన్ని అమలునకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Agnipath Protests: నియామకాల్లో అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్
ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు కేంద్ర సాయుధ బలగాలు ( సీఆర్ పిఎఫ్ ), అసోం రైఫిల్స్ నియామకాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు శనివారం కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ట వయోపరిమితిలోనూ అగ్ని వీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల తొలి బ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తం అయిదేళ్లు సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది.
ఆర్మీ అభ్యర్ధుల్లో ఆందోళన
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అనౌన్స్ చేసిన వెంటనే దేశ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆర్మీ రిక్రూట్ మెంట్ కు ఎంపికై ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్ధులు ఫైనల్ పరీక్షలకు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ నియామకాలు రద్దు చేసినట్లు భావిస్తున్న అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అభ్యర్ధుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022