NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

AIIMS chief Randeep Guleria: లాక్ డౌన్ నిబంధనలు సరళిస్తున్న వేళ ఢిల్లీ ఏఐఐఎంఎస్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు..!!

third wave is inevitable says AIIMS chief Randeep Guleria

AIIMS chief Randeep Guleria: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను అమలు చేయడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తున్నది. తాజాగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్రజలు మళ్లీ యథావిధిగా రోడ్లపైకి, మార్కెట్ లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ జాతీయ మీడీయా ఛానల్ తో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

AIIMS chief Randeep Guleria says third wave is inevitable
AIIMS chief Randeep Guleria says third wave is inevitable

Read More: Big Breaking: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత

ప్రజలు కరోనా కట్టడి నిబంధనలను విస్మరిస్తే కరోనా మూడవ దశ అనివార్యమని హెచ్చరించారు గులేరియా. పరిస్థితులు ఇలానే కొనసాగితే నెలన్నర నుండి రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ ప్రారంభం అవుతుందని అంచనా వేశారు.  మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని ఆయన పునురుద్ఘాటించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసే క్రమంలో భాగంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం తప్పుడు విధానం కాదని పేర్కొన్నారు.

కరోనా కట్టడికి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ..హాట్ స్పాట్ లపై గట్టి నిఘా పెట్టడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు. లేకపోతే వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త మ్యూటేషన్లు వస్తాయని గులేరియా హెచ్చరించారు. కొత్త వేరియంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ పై ఇంకా అధ్యయనం జరగాల్సిన ఉందని చెప్పారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!