Aishwarya Roy: ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆఖ‌రికి అగరుబ‌త్తీలు అమ్ముకుంటున్నాడు

Share

Aishwarya Roy: ఆర్జేడీ అధినేత‌, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కారు. అప్పుడ‌ప్పుడు రాధలా, కృష్ణుడిలా, శివుడిలా త‌యార‌వుతూ వార్త‌ల్లో నిలిచే తేజ్‌ప్రతాప్ గెట‌ప్‌ల వెనుక అస‌లు నిజాలు అనంత‌రం వెలుగులోకి వ‌చ్చాయి. ఈ క‌ల‌క‌లం కొన‌సాగిన అనంత‌రం తాజాగా మ‌ళ్లీ ఇంకో సంచ‌ల‌న ప‌రిణామంతో తేజ్ ప్ర‌తాప్ వార్తల్లో నిలిచారు. తాజాగా తేజు.. ఎల్ అండ్ ఆర్ (లాలూరబ్రీ) బ్రాండ్ పేరిట అగర్ బత్తీల తయారీ వ్యాపారంలోకి ప్రవేశించారు.

Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌

వ్యాపారంలోకి ఎంట్రీ…
తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించినా.. శివుడి , కృష్ణుడి, అఘోరా గెటప్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. దేశమంతటా ఆయన గురించి తెలిసింది ఈ గెటప్ ల వల్లే. ఇప్పుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన పశువుల దాణా ఉత్పత్తి షెడ్డులో అగర్ బత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తేజ్ ప్రతాప్ ప్రకటించారు. దేవాలయాల్లోని పూలను సేకరించి సేంద్రీయ పదార్థాలు, సుగంధ ద్రవ్యాల నూనెల సహాయంతో అగర్ బత్తులను తయారు చేస్తున్నారు. సువాసన వెదజల్లే ధూప కర్రలకు కృష్ణలీలా అగర్ బత్తి, బర్సనా అగర్ బత్తి, సేవాకుంజ్ అగర్ బత్తిలనీ తేజ్ ప్రతాప్ పేరు పెట్టారు. అగర్ బత్తీల తయారీ కర్మాగారాన్ని తేజ్ ప్రతాప్ తన మొబైల్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తారని ఓ ఉద్యోగి చెప్పారు. దేశవ్యాప్తంగా తాము తయారు చేస్తున్న అగర్ బత్తులను విక్రయిస్తామని తేజ్ ప్రతాప్ చెప్పారు.

Read More: Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

ఇది బ్యాక్ గ్రౌండ్‌..
కొద్దికాలం క్రితం తేజ్ ప్ర‌తాప్ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఓ దళితుడి ఇంటికి వెళ్లి అక్కడ స్నానం చేసిన తేజ్ ప్రతాప్ ఆ తర్వాత మళ్లీ ఓ సైకిల్ యాత్ర కూడా చేశారు. అనంత‌రం పాట్నాలో ఉన్న శివాల‌యంలో శివుడి అవతారాన్ని ధరించి ఆ వేషధారణలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పులి చర్మం ధరించి.. తేజ్ ప్రతాప్ ప్రత్యేకంగా కనిపించారు. ఇక్క‌డ నుంచి ఆయ‌న‌ డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. అయితే, ఈ వేషాలు, ప్ర‌త్యేక‌త‌ల వెనుక అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సెక్ష‌న్ 26 ప్రకారం త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఫ్యామిలీ కోర్టులో ఐశ్వ‌ర్య దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో ఆశ్చ‌ర్యక‌ర విష‌యాలు ఆమె బ‌య‌ట‌పెట్టింది. ఆ పిటిష‌న్‌లో తేజ్ ప్ర‌వ‌ర్త‌న‌ గురించి ఆస‌క్తిక‌ర నిజాల‌ను చెప్పింది. గంజాయి తాగిన త‌ర్వాత గాగ్రాచోలీ వేసుకుని రాధ‌లా త‌యార‌య్యేవాడ‌ట‌. మేక‌ప్‌, ఎయిర్‌విగ్‌ను కూడా ధ‌రించేవాడు. గంజాయి శివుడి ప్ర‌సాదం, దాన్ని ఎలా వ‌ద్దంటాను అని అనేవాడని పేర్కొంది. కృష్ణుడే రాధ‌, రాధే కృష్ణుడు అంటూ ఆ దుస్తుల‌ను వేసుకునేవాడు. త‌న చ‌దువు గురించి కూడా తేజ్ ప్ర‌తాప్ త‌క్కువ‌గా మాట్లాడేవాడు అని ఐశ్వ‌ర్య త‌న‌ ఫిర్యాదులో పేర్కొంది.


Share

Related posts

Shruthi Selvam latest photos in saree

Gallery Desk

ఆంక్షలు సడలించే అవకాశం April 20 తర్వాతే ..

Siva Prasad

ఐఓసీఎల్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది..

bharani jella