జాతీయం న్యూస్

PM Modi: ప్రధాని మోడీది చాలా సున్నిత మనస్థత్వం .. నెమలికి ఆహారం ఇవ్వడానికి ఓ సారి సమావేశాన్నే అపేశారని చెప్పిన అమిషా

Share

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది సున్నితమైన మనస్తత్వమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోడీలోని సున్నిత వ్యక్తిత్వ కోణాన్ని తెలియజేసే ఓ ఉదంతాన్ని గుర్తు చేశారు అమిత్. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధాన మంత్రిగా 20 ఏళ్ల నుండి అమలు చేస్తున్న పరిపాలనా విధానాలపై బ్లూక్రాఫ్ట్ ఫౌండేషన్ సంకలనం చేసిన [email protected] Dreams Meet Delivery పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం దేశ రాజదాని ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా.. గతంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ను గుర్తు చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో నెమలి తన ముక్కుతో గాజును కొడుతుండటం చూసిన మోడీ..అది ఆకలితో ఉందని గ్రహించి దానికి ఆహారం ఇవ్వాలని తన సిబ్బందిని సూచించారని చెప్పారు. ముఖ్యమైన సమావేశంలో నిమగ్నమైనప్పటికీ మోడీ ఆకలితో ఉన్న నెమలి గురించి ఆలోచించడం ఆయనలోని సున్నిత మనస్థత్వాన్ని తెలియజేసిందని అమిషా అన్నారు.

Amit shah says PM Modi deeply sensitive
Amit shah says PM Modi deeply sensitive

PM Modi: మోడీ సమర్ధవంతమైన నాయకుడు

2020లో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో నెమలికి అహారం తినిపిస్తున్న ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే సందర్భంలో అమిత్ షా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ సమర్ధవంతమైన నాయకుడు అని కొనియాడారు. ఎలాంటి కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రాపకం వంటివి లేకపోయినా భూకంపాలు సంభవించే గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు సీఎంను చేశారనీ, ఆయన తన సమర్ధత పాలన అందించి అనేక మార్లు ఎన్నికల్లో విజయం సాధించారని అమిత్ షా పేర్కొన్నారు. ఆ తరువాత దేశ నాయకుడుగా ఎదిగారని పేర్కొన్నారు అమిత్ షా.


Share

Related posts

Rana: గిరిజనులను ఆదుకున్న దగ్గుబాటి రానా..??

sekhar

AP credai : మంత్రి బొత్సాను కలిసిన ఏపి క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు..! ఎందుకంటే..?

somaraju sharma

Cloves: పరగడుపున రెండు లవంగాలు తింటే మనం ఊహించని ప్రయోజనాలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar