Video Viral: ఓ బీజేపీ వీరాభిమాని వీడియో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను ఆకర్షించింది. ఆ వీడియోను అమిత షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అభిమానమే బీజేపీ శక్తి అంటూ అమిత్ షా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకు లక్షలాదిగా వ్యూస్, లైక్ లు వస్తున్నాయి. విషయంలోకి వెళితే .. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అగ్రనేతలతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ అభ్యర్ధులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలోని దేవనహళ్లి ప్రాంతంలో శుక్రవారం బీజేపీ రోడ్ షో నిర్వహించతలపెట్టింది. ఈ సభకు హోం మంత్రి అమిత్ షా కూడా హజరుకావాల్సి ఉంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మోడీ కటౌట్లను ఏర్పాటు చేసింది పార్టీ. అయితే వర్షం కారణంగా ఈ రోడ్ షో రద్దు అయ్యింది.

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ మోడీ కటౌట్ పై వాన చినుకులను చూసిన ఓ అభిమాని తన కండువాతో వాటిని తుడిచాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీసి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా అని అతను ఆ అభిమానిని ప్రశ్నించాడు. దీనిపై అతను సమాధానం ఇస్తూ “నాకు డబ్బులు అవసరం లేదు. నేను ఎవరి నుంచీ డబ్బులు ఆశించను. మోడీపై విశ్వాసం, ప్రేమాభిమానాలతోనే ఇదంతా చేస్తున్నా” అని పేర్కొన్నాడు. అంతే కాకుండా మోడీ మాకు దేవుడు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు. ఈ వీడియోను హోం మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మోడీపై అచంచల విశ్వాసం, నిస్వార్ధ ప్రేమాభిమానే బీజేపీ బలం, ఆస్తి. ఈ అద్భుతమైన వీడియో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ కూడా స్పందించింది. రాష్ట్రంలో అనేక మంది మోడీని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారని కామెంట్స్ చేసింది.
YSRCP: ఏపిలో టీడీపీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీదే హవా అని పేర్కొన్న టైమ్స్ నౌ సర్వే
The unwavering trust in PM @narendramodi Ji and the selfless affection for him is what the BJP has earned and it is its source of strength.
Have a look at this beautiful video from Devanahalli, Karnataka. https://t.co/1OFAlZ1ibL
— Amit Shah (@AmitShah) April 21, 2023