NewsOrbit
జాతీయం

Amit Shah : మమతా బెనర్జీ ప్రభుత్వం పై అమిత్ షా సీరియస్ వ్యాఖ్యలు..!!

Share

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 35 స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రంలో మమత సర్కార్ కు ముగింపు పలుకుతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్ లో భీర్భుమ్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ… గత లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 18 స్థానాల్లో గెలవటం జరిగింది. దీంతో రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాలను అరికట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈసారి 35 స్థానాలలో గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతి పాలనకు ముగింపు పలుకుతామని బెంగాల్ ప్రజలకు అమిత్ షా హామీ ఇచ్చారు.

Amit Shah's serious comments on Mamata Banerjee's government

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ల అవినీతి పాలనకు చెక్ పెడతామని స్పష్టం చేశారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోకి చొరబాటుదారులను ఆహ్వానించాలనుకుంటున్నారా..? చొరబాట్లను అడ్డుకోవాలని భావిస్తున్నారా..? అని ప్రజలను ప్రశ్నించారు. విదేశాల నుండి వచ్చే చొరబాటు దారులను అడ్డుకోవాలన్న రాష్ట్రంలో అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయాలన్న భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అంటూ బెంగాల్ ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గెలుపు కోసం బీజేపీ ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉంది. 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ టైంలో బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు.. చాలామంది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే పాగా వేశారు. ప్రచారంలో కీలకంగా రాణించారు.

Amit Shah's serious comments on Mamata Banerjee's government

అయినా గాని మమతా బెనర్జీ పార్టీ అత్యధికమైన స్థానాలు గెలిచి ప్రభుత్వం స్థాపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఎలాగైనా మమతా బెనర్జీని దెబ్బ కొట్టడానికి.. అత్యధికమైన ఎంపీ స్థానాలు గెలవడానికి బీజేపీ భారీ వ్యూహాలతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భీర్భుమ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేవలం ఎన్నికల సీజన్ సమయంలోనే అమిత్ షా రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోతుంటారని సెటైర్లు వేస్తున్నారు.


Share

Related posts

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

somaraju sharma

‘ఆదానీ’ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ

somaraju sharma

కర్ణాటకలో సీఎం రేసులో తెరపైకి మరో కీలక నేత .. మద్దతుగా భారీ ర్యాలీ

somaraju sharma